Prashant Kishor: కాంగ్రెస్‌లోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాకపుట్టిస్తున్న ఢిల్లీ రాజకీయాలు..

|

Jul 15, 2021 | 8:16 AM

Prashant Kishor To Join Congress?: దేశంలో కొన్ని రోజుల నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 2024 జరగనున్న సార్వత్రిక

Prashant Kishor: కాంగ్రెస్‌లోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాకపుట్టిస్తున్న ఢిల్లీ రాజకీయాలు..
Prashant Kishor
Follow us on

Prashant Kishor To Join Congress?: దేశంలో కొన్ని రోజుల నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 2024 జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై పలు ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఈ క్రమంలో రాజకీయ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. పొలిటికల్ హీట్‌ను మరింత పెంచారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌తో కూడిన ఫ్రంట్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు సార్లు ఎన్‌సీపీ శరద్ పవార్‌ను సమావేశమవ్వడం.. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అప్పటినుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక.. ప్రశాంత్‌ కిశోర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ప్రశాంత్‌ కిషోర్ పార్టీలో జాయిన్ అయితే.. ఏలాంటి బాధ్యతలు అప్పజెప్తారన్న విషయంపై కూడా చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.

అందరూ అనుకున్నట్లు ఈ సమావేశం.. వచ్చే ఏడాది జరిగే పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు మాత్రమే పరిమితమైనది కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వాదనకు మరింత బలం ఇచ్చేలా ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ హరీశ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక్ష రాజకీయాల్లో రానున్నట్లు తెలుస్తోంది. మూడు నాలుగు రోజుల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓ శుభవార్త వింటారని.. అది ఒక పంజాబ్‌కే పరిమితమైనది కాదని రావత్ అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యల అనంతరం.. పీకే కాంగ్రెస్‌లో చేరి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారన్న ఊహగానాలు మొదలయ్యాయి. పలు రాష్ట్రాల సీఎంలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. వారు నాయకత్వం వహిస్తున్న కొన్ని పార్టీలు ఎన్డీయేను వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. ఎన్డీయే వ్యతిరేక పార్టీలతో కూటమిగా ఎదుర్కొనేందుకు ప్రశాంత్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదిలాఉంటే.. పీకే భేటీ అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ పోటీలో ఉంటారన్న వార్తలపై.. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధమని.. తాను పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. కాగా 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు.. వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు నాయకత్వం గురించి ప్రశాంత్‌ కిషోర్‌తో ఎలాంటి చర్చలు జరుగలేదని శరద్‌ పవార్‌ వెల్లడించారు.

Also Read:

Sharad Pawar: ఫలితాల గురించి అంతా తెలుసు.. రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం అబద్ధం: శరద్‌ పవార్‌

IT Act: ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఎ కింద నమోదైన కేసులన్నీ వెంటనే ఉపసంహరించుకోండి..రాష్ట్రాలను కోరిన కేంద్ర ప్రభుత్వం