దివంగత నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ పుస్తకం ‘ప్రెసిడెన్షియల్ ఇయర్’ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఇదే సమయంలో ఆయన కుటుంబంలోనూ విభేదాలు సృష్టించింది. ప్రణబ్ ‘ప్రెసిడెన్షియల్ ఇయర్’ పుస్తకం విడుదల విషయమై ఆయన కుమారుడు అభిజిత్ బెనర్జీ, కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ మధ్య విభేదాలు తలెత్తాయి. తన అనుమతి లేకుండా ఈ పుస్తకాన్ని విడుదల చేయొద్దంటూ సదరు పుస్తకాన్ని ముద్రించిన రూపాను అభిజిత్ ముఖర్జీ హెచ్చరించారు. ఈ మేరకు ‘రూపా’కు వార్నింగ్ ఇస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అయితే అభిజిత్ హెచ్చరికకు అతని సోదరి శర్మష్ఠ తీవ్రంగా స్పందించారు. అభిజిత్‌కు కౌంటర్ అటాక్ ఇచ్చారు. తన తండ్రి పుస్తకం విడుదల కాకుండా ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. సొంత ప్రచారం కోసమే పుస్తకంపై వివాదం సృష్టించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. పుస్తకాన్ని విడుదల చేయాల్సిందేనంటూ శర్మిష్ఠ స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ ఇద్దరే కారణమంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వైఖరిని తన ‘ప్రెసిడెన్షియల్ ఇయర్’ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ ఆరోపించారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది.
Also read:
స్నేహ హస్తం… బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు… కలిసి పని చేయాలని ఆకాంక్ష…