మీరు స్మార్ట్‌టీవీ కొనాలనుకుంటున్నారా?.. కొత్తగా క్యూలెడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన షోవోమీ.. ధర ఎంతంటే?..
ప్రముఖ మొబైల్ సంస్థ భారత్‌లో సరికొత్త స్మార్ట్ టీవీని లాంఛ్ చేసింది. ఎంఐ క్యూలెడ్ టీవీ 4కే మోడల్‌ను విడుదల చేసింది షావోమి.
ప్రముఖ మొబైల్ సంస్థ భారత్‌లో సరికొత్త స్మార్ట్ టీవీని లాంఛ్ చేసింది. ఎంఐ క్యూలెడ్ టీవీ 4కే మోడల్‌ను విడుదల చేసింది షావోమి. క్యూలెడ్ అల్ట్రా హెచ్డీ స్క్రీన్ గల ఈ స్మార్ట్ టీవీ 55 అంగుళాలు ఉంటుంది. ప్యాచ్ వాల్ సపోర్ట్‌ను కూడా అందుబాటులో ఉంచింది ఈ సంస్థ. కాగా ఈ టీవీ ధర మాత్రం రూ.54,999 ఉండనుంది. ఇటీవల వన్ ప్లస్, టీసీఎల్ లాంటి బ్రాండ్స్ ఇండియాలో క్యూలెడ్ టీవీలను పరిచయం చేయగా.. షావోమీ మొదటి సారి క్యూలెడ్ టీవీని ఇండియాలో లాంఛ్ చేసింది.
వన్ ప్లస్, టీసీఎల్ విడుదల చేసిన టీవీల ధరలు రూ.60,000 వరకు ఉన్నాయి. అయితే షావోమీ లాంఛ్ చేసిన ఎంఐ క్యూలెడ్ 4కె స్మార్ట్‌టీవీ మాత్రం వన్ ప్లస్ , టీసీఎల్ 55సీ715 లాంటీ టీవీలకు పోటీగా మారనుంది. ఇప్పటివరకు షావోమి సంస్థ ఎల్ఈడీ టీవీలను మాత్రమే లాంఛ్ చేసింది. మొదటి సారి ఈ సంస్థ నుంచి అతి ఖరీదైన ఎంఐ క్యూలెడ్ టీవీని లాంఛ్ చేసింది. దీని ధర రూ.54,999 ఉంది. ఈ స్మార్ట్ టీవీ డిసెంబర్ 21 నుంచి ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ యాప్‌లలోకి అందుబాటులోకి రానుంది.