Pranab Autobiography: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు తాను వ్యతిరేకం.. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోయిందన్న…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించి.. తెలంగాణాని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంపై తన ఆత్మకథలో దివంగత మాజీ రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

Pranab Autobiography: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు తాను వ్యతిరేకం.. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోయిందన్న...

Updated on: Jan 07, 2021 | 5:48 PM

Pranab Autobiography: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించి.. తెలంగాణాని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంపై తన ఆత్మకథలో దివంగత మాజీ రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తి గతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమని ఆయన తన ఆత్మకథలో స్పష్టం చేశారు. “మై ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌: 2012-2017” పేరుతో ప్రణబ్ ఆత్మకథ పుస్తకం విడుదలైంది. తన చేతుల మీదుగా తెలుగు రాష్ట్రం రెండు ముక్కలుగా విభజించాల్సి వస్తుందని.. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందనే విషయాన్ని తాను ఏ మాత్రం ఊహించలేకపోయానన్నారు.

ఏపీ విభజన అనంతరం కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారిందని.. రాష్ట్రం ఇచ్చిన తెలంగాణాలో కూడా ప్రతికూల రాజకీయ వాతావరణం ఏర్పడిందని ప్రణబ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అత్యంత బలమైన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలు లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విభజనతో ఏపీ ప్రజల ఆగ్రహానికి గురై..కాంగ్రెస్ తన ఆధిక్యతను కోల్పోయిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇక తెలంగాణ ఆవిర్భావ దినానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్‌ ముఖర్జీ సంతకం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రణబ్ ఆత్మకథలో వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు అంశంపై కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు.

Also Read: కాంగ్రెస్ సారథ్యంలో సోనియా విఫలం.. మోదీది నియంతృత్వ విధానం.. ఆత్మకథలో మాజీ రాష్ట్రపతి..