Pralhad Joshi: మరోసారి రైతులతో సమావేశం అవుతాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

|

Feb 18, 2025 | 1:05 PM

రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌తో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన పలు విషయాలు వెల్లడించారు. చర్చలు సానుకూలంగా జరిగాయని, అయితే మరోసారి రైతులతో చర్చలు జరుపుతామంటూ కూడా వెల్లడించారు.

Pralhad Joshi: మరోసారి రైతులతో సమావేశం అవుతాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి
Pralhad Josh
Follow us on

రైతు సంఘం నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌లో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి పలు కీలక విషయాలు వెల్లడించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు, కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జగ్జిత్‌ సింగ్‌తో కేంద్ర మంత్రి చండీఘడ్‌లో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..”పంజాబ్‌ ప్రభుత్వంతో కలిసి మేం రాజకీయాలో సంబంధం లేని రైతు సంఘం సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులతో సమావేశం అయ్యాం. మా మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి. రైతుల డిమాండ్ల వివరంగా విన్న తర్వాత.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుందో వివరించాను.

అలాగే జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ను నిరాహార దీక్షను విరమించాల్సిందిగా కోరాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. దానికి గురించి ఆలోచిస్తానని చెప్పారు. అలాగే మరోసారి రైతులతో సమావేశం కావాలని నిర్ణయించాం. ఫిబ్రవరి 22న మరోసారి రైతులు, రైతు సంఘాలతో చర్చలు జరుపుతాం. ఆ చర్చలకు కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో నిర్వహిస్తాం” అని కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే రైతుల చాలా కాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అనేక రైతుల సంఘాలు ఒక్కటై సంయుక్త కిసాన్‌ మోర్చాగా ఏర్పడింది. ఈ సంఘానికి జగ్జిత్‌ సింగ్‌ నాయకత్వం వహిస్తున్నారు.

గడిచిన కొన్నేళ్లుగా ఆయన అనేక సమస్యలపై పోరాటం చేశారు. కొన్ని ప్రత్యేక పంటలకు హామీ ధర, రుణమాఫి, 2020లో ఢిల్లీలో జరిగిన రైతు పోరాటంలో చనిపోయిన వారికి నష్టపరిహారం డిమాండ్లతో సంయక్త కిసాన్‌ మోర్చా పోరాడుతోంది. ఈ డిమాండ్లను నేరవేర్చాలంటూ రైతులు పలు సందర్భాల్లో ఢిల్లీకి పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, కేంద్ర భద్రతా బలగాలు రైతులను పంజాబ్‌ హర్యానా సరిహద్దుల్లోనే ఆపేశాయి. దీంతో రైతు సంఘం నేత జగ్జిత్‌ సింగ్‌ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనతో చర్చలు జరిపి, ఆయనను హాస్పిటల్‌లో చేర్పించే ఏర్పాట్లు చేయాలని సుప్రీం కోర్టు గతంలోనే పంజాబ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.