రేవణ్ణ నివాసంలో సిట్‌ సోదాలు.. ప్రజ్వల్‌ కోసం బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ

సిట్ అధికారులు కెంపేగౌడ విమానాశ్రయంలో క్యాంపు ఏర్పాటు చేసి ఇమ్మిగ్రేషన్‌లో బెంగళూరుకు వచ్చే విమానాల ప్రయాణికుల జాబితాను తనిఖీ చేస్తున్నారు. ప్రజ్వల్ పాస్‌పోర్ట్ నంబర్ ఉన్న టికెట్‌ని చెక్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ విమానంలోనూ ప్రజ్వల్ టికెట్ బుక్ చేసుకోలేదు. దుబాయ్, మస్కట్, ఫ్రాంక్‌ఫర్ట్ సహా పలు దేశాల విమానాలపై అధికారులు డేగ కన్ను ఉంచారు. రెండు షిఫ్టుల్లో రెండు బృందాలు విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్నాయి. 

రేవణ్ణ నివాసంలో సిట్‌ సోదాలు.. ప్రజ్వల్‌ కోసం బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ
H.d. Revanna

Updated on: May 06, 2024 | 7:11 PM

కర్నాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసులో సిట్‌ దూకుడును పెంచింది. ఆయన తండ్రి రేవణ్ణ ఇప్పటికే సిట్‌ కస్టడీలో ఉన్నారు. బెంగళూర్‌లో హెచ్‌డీ రేవణ్ణ నివాసంలో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. లైంగిక వేధింపుల కేసులో ఆధారాల కోసం ఆయన నివాసాన్నిక్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరోవైపు కోర్టులో రేవణ్ణ తరపున ఆయన లాయర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ కోసం ఇప్పటికే బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ప్రజ్వల్‌ రేవణ్ణ అశ్లీల వీడియోలు బయటపడడంతో హాసన్‌ జిల్లాలో అలజడి రేగింది. వీడియోలో ఉన్న మహిళలంతా ఇళ్ల నుంచి అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. బాధితురాలి కిడ్నాప్‌తో తనకు సంబంధం లేదంటున్నారు రేవణ్ణ.

ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది . దీన్ని అస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్.. బీజేపీ, జేడీఎస్‌ల పొత్తుపై విమర్శలు చేస్తోంది. ప్రధాని మోదీపై దాడికి జాతీయ నేతలు కూడా ప్రజ్వల కేసును ఉపయోగించుకున్నారు. ఈలోగా, మే 7న ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజ్వల్ తిరిగి భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్ 26వ తేదీ అర్ధరాత్రి ప్రజ్వల్ దేశం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రజ్వల్ మే 5న బెంగళూరుకు వస్తాడని ప్రచారం జరిగింది. బెంగళూరు, మంగళూరు, గోవా లేదా కొచ్చి విమానాశ్రయాల్లో సిట్ అధికారులు వేచి ఉన్నారు. కానీ ప్రజ్వల్ రాలేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎన్నికల తర్వాత అంటే మే 7 తర్వాత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 2వ విడత పోలింగ్ తర్వాత ప్రజ్వల్ లొంగిపోయే అవకాశం కూడా ఉంది.  మహిళా కమిషన్ కూడా ప్రజ్వల్‌కు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..