Prajwal Revanna Case: లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. ప్రజ్వల్ రేవణ్ణ దుప్పటి, దిండ్లు సీజ్.. ఎందుకంటే..

|

May 29, 2024 | 3:15 PM

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, హసన్ జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు కర్ణాటకను కుదిపేస్తోంది. ఈ కేసు అనంతరం ఏప్రిల్‌ 27వ తేదీన జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఈనెల 31వ తేదీన భారత్‌కు వస్తానని, సిట్‌ విచారణ ముందు హాజరవుతానని వెల్లడించారు.

Prajwal Revanna Case: లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. ప్రజ్వల్ రేవణ్ణ దుప్పటి, దిండ్లు సీజ్.. ఎందుకంటే..
Prajwal Revanna Case
Follow us on

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, హసన్ జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు కర్ణాటకను కుదిపేస్తోంది. ఈ కేసు అనంతరం ఏప్రిల్‌ 27వ తేదీన జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఈనెల 31వ తేదీన భారత్‌కు వస్తానని, సిట్‌ విచారణ ముందు హాజరవుతానని వెల్లడించారు. తన జర్మనీ పర్యటనకు, లైంగిక వేధింపుల కేసుకు సంబంధం లేదని ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియో స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. అయితే, ప్రజ్వల్ కేసులో సిట్ దూకుడు పెంచింది.. ఆయన విచారణకు ముందు మరిన్ని వివరాల సేకరణలో నిమగ్నమైంది..

ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్ ) మంగళవారం (మే 28) రాత్రి హసన్ నగర్ ఆర్‌సి రోడ్‌లోని ప్రజ్వల్ రేవణ్ణ ఇంట్లో సోదాలు నిర్వహించింది. సిట్, ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు ప్రజ్వల్ ఇంట్లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. రాత్రంతా సోదాలు జరిపిన అనంతరం ప్రజ్వల్‌ రేవణ్ణ ఇంట్లోని పలు ప్రాంతాల్లో వేలిముద్రల నమూనాలను సేకరించారు. ప్రజ్వల్‌ రేవణ్ణ బెడ్‌రూమ్‌లోని మంచం, దిండు, దుప్పటి తదితర వస్తువులను సిట్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం తీసుకెళ్లింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో వాటిని ల్యాబ్ కు తరలించి పరీక్షలు చేయనున్నారు.

కాగా.. లోక్ సభ ఎన్నికల వేళ.. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు కర్నాటకలో వైరల్‌ అయ్యాయి. ప్రజ్వల్‌ రేవణ్ణ అనేక మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా.. ఆయన దౌత్య పాస్ పోర్ట్‌ను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో జేడీఎస్ సైతం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.. అంతేకాకుండా దేవగౌడ కూడా భారత్ రావాలంటూ రేవణ్ణను హెచ్చరించారు.

ఈ క్రమంలో లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన రేవణ్ణ తాను ఏ తప్పు చేయలేదని, 31న ఇండియాకు తిరిగొస్తున్నట్లు వీడియో ద్వారా చెప్పారు. దీనిలో భాగంగా.. రేవణ్ణ రేపు బెంగళూరుకు చేరుకోనున్నారని సమాచారం.. అనంతరం 31న ఆయన సిట్ విచారణకు హాజరుకానున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..