PM Modi Birthday: ‘వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో ఆయనది అలుపెరుగని కృషి..’ PM మోదీకి ప్రహ్లాద్‌ జోషీ స్పెషల్ విషెస్‌

ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రముఖ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ కూడా ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి ఓ విడుదల విడుదల చేశారు. అందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 17: ప్రధాని మోదీ 75వ పుట్టిన రోజు బుధవారం (సెప్టెంబర్‌ 17) జరుపుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రముఖ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ కూడా ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు. ఆయన ప్రధానికగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్‌ ముందుకెళ్తుంది. భారత్‌ ఓ శక్తివంతమైన దేశంగా ప్రపంచం గుర్తించింది. ప్రపంచ వేదికపై ఏ దేశం కూడా నేడు భారత్‌ను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. మోదీ అలుపెరగని కృషి, విజన్‌ కారణంగానే భారత్‌ ఈ స్థాయికి చేరుకుంది. వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో దేవుడు ఆయనకు మరింత శక్తి, ఆయుష్షు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నట్లు వీడియో విడుదల చేశారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.