చీపురు పట్టిన హేమా మాలిని.. ట్రోల్ చేసిన ఒమర్ అబ్దుల్లా

| Edited By:

Jul 14, 2019 | 2:07 AM

పార్లమెంట్ ఆవరణలో శనివారం స్వచ్ఛ భారత్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు చీపుర్లు చేతపట్టుకుని ఊడ్చారు. అయితే నటి, మధుర ఎంపీ హేమామాలిని కూడా ఇందులో పాల్గొన్నారు. చీపురుకట్టలతో వీరు పార్లమెంటులో ఆవరణను శుభ్రపరిచే ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ‘స్వచ్ఛ భారత్’ ప్రోగ్రాంను కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ డ్రైవ్‌పై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ […]

చీపురు పట్టిన హేమా మాలిని.. ట్రోల్ చేసిన ఒమర్ అబ్దుల్లా
Follow us on

పార్లమెంట్ ఆవరణలో శనివారం స్వచ్ఛ భారత్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు చీపుర్లు చేతపట్టుకుని ఊడ్చారు. అయితే నటి, మధుర ఎంపీ హేమామాలిని కూడా ఇందులో పాల్గొన్నారు. చీపురుకట్టలతో వీరు పార్లమెంటులో ఆవరణను శుభ్రపరిచే ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ‘స్వచ్ఛ భారత్’ ప్రోగ్రాంను కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

అయితే పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ డ్రైవ్‌పై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోనే అతి శుభ్రమైన ప్రాంతాల్లో పార్లమెంటు కాంప్లెక్స్ ఒకటని ఆయన అన్నారు. అందులోనూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో వారక్కడ ఏమి ఊడుస్తారు’ అంటూ పరిశుభ్రతా డ్రైవ్‌లో పాల్గొన్న వారిని ఒక ట్వీట్‌లో ఒమర్ ప్రశ్నించారు. ఇక మరో ట్వీట్‌లో ఎంపీ హేమమాలినిని ఉద్దేశిస్తూ ‘మేడం…దయచేసి మీరు ఈసారి బయట ఫోటో సెషన్‌లో పాల్గొనేటప్పుడు చీపురుకట్ట ఎలా పట్టుకుని ఊడ్చాలో ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసిన మెలకువలతో మధురలో కూడా మెరుగైన శుభ్రత అనేది సాధ్యం కాదు’ అంటూ ట్రోల్ చేశారు.