Puducherry:విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు.. పవర్ కట్స్‌తో అవస్థలు పడుతున్న జనాలు..

పుదుచ్చేరిలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన మరింత ఉధృతమయ్యింది. దాంతో అలర్ట్ అయిన సర్కార్.. పరిస్థితిపై హోంమంత్రి నమశ్శివాయమ్ అత్యవసర సమావేశం..

Puducherry:విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు.. పవర్ కట్స్‌తో అవస్థలు పడుతున్న జనాలు..
Employees Protest In Puduch

Updated on: Oct 02, 2022 | 5:19 PM

పుదుచ్చేరిలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన మరింత ఉధృతమయ్యింది. దాంతో అలర్ట్ అయిన సర్కార్.. పరిస్థితిపై హోంమంత్రి నమశ్శివాయమ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాని పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఆందోనళలు ఉధృతం అవడంతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత పెంచాలని పోలీసులను కోరారు. విద్యుత్ సరఫరా ప్రైవేటీకరణపై ఉద్యోగులు ఆందోళనలు విరమించాలని మంత్రి కోరారు. గత నాలుగు రోజులుగా పుదుచ్చేరిలో విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఫలితంగా అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పవర్‌కట్‌తో జనం అవస్థలు పడుతున్నారు.

మరోవైపు సబ్‌స్టేషన్లపై ఆందోళనకారుల దాడులతో విద్యుత్‌ సరఫరా నిలిచింది. పుదుచ్చేరి, కారైకాల్‌తో సహా పలు ప్రాంతాలలో పవర్‌కట్‌ ఉంది. సీఎం ఎన్‌.రంగస్వామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై ఇళ్లలోనూ కరెంట్‌ సరఫరా లేదు. రాత్రి కాగడాలతో నిరసనలు హోరెత్తించారు ఆందోళనకారులు. పుదుచ్చేరి విద్యుత్తు పంపిణీ సంస్థను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 4 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నా.. నిన్న ఈ పోరు పీక్స్‌కి చేరింది. సీఎం, గవర్నర్‌ ఇళ్లకు కూడా పవర్‌ కట్‌ అయ్యింది. ఈ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు జనం కూడా రోడ్లపైకి వచ్చారు. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెతో ఇప్పటికే 100 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు.

విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో వంద శాతం ప్రైవేటీకరణకు కేంద్రం OK చెప్పడాన్ని వ్యతిరేకిస్తూు.. ఉద్యోగులు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు.. తీవ్రతరం అవడంతో ఇప్పుడు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు కూడా పుదుచ్చేరి చేరుకుని వారితో చర్చిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..