Padma Awards: నచ్చినవారికే బహుమానాలు.. వివాదాస్పదమవుతున్న పద్మ అవార్డుల ప్రదానోత్సవం!

|

Nov 10, 2021 | 4:57 PM

పద్మ అవార్డుల ప్రదానోత్సవంపై రాజకీయ రగడ రాజుకుంది. బీజేపీకి మద్దతిచ్చే వాళ్లకే అవార్డులు ఇస్తున్నారని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు కేంద్రంపై విమర్శలు కురిపిస్తున్నాయి.

Padma Awards: నచ్చినవారికే బహుమానాలు.. వివాదాస్పదమవుతున్న పద్మ అవార్డుల ప్రదానోత్సవం!
Padma Awards Controversy
Follow us on

Padma Awards controversy: పద్మ అవార్డుల ప్రదానోత్సవంపై రాజకీయ రగడ రాజుకుంది. బీజేపీకి మద్దతిచ్చే వాళ్లకే అవార్డులు ఇస్తున్నారని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు కేంద్రంపై విమర్శలు కురిపిస్తున్నాయి. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.

క‌రోనా మ‌హమ్మరి స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రజ‌ల‌కు స‌హ‌యం చేసిన సోనూ సూద్‌కు ప‌ద్మ అవార్డు ఇవ్వకపోవ‌డం ప‌ట్ల ప‌లువ‌రు రాజకీయ నాయక‌లు, ప‌లువురు సెల‌బ్రెటీలు, సామాన్యులు కూడా కేంద్ర ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. సోనూ సూద్‌ ప్రజా సేవ చేశారనని కాని, కంగ‌నా సినిమాలలో న‌టించ‌డం త‌ప్ప ప్రజ‌ల‌కు ఎలాంటి స‌హాయం చేసిందని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజ‌ల‌కు స‌హాయం చేయ‌లేదు గానీ.. బీజేపీకి చాలానే స‌హ‌యం చేసిందని అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కంగ‌న రనౌత్‌కు ప‌ద్మ శ్రీ అవార్డు తో స‌త్కరించింద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈ విమ‌ర్శల స్థాయి రోజు రోజు కు పెరిగిపోతుంది.

సోష‌ల్ మీడియా లో సోను సూద్ చేసిన సేవ‌లను కంగ‌నా రౌన‌త్ చేస్తున్న ఎక్స్ పోజింగ్ ల‌ను ఫోటోల రూపం లో పెట్టి కేంద్రాన్ని విప‌రీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ కూడా ప‌ద్మ అవార్డులపై కేంద్ర ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పించారు. తెలంగాణకు చెందిన వాళ్లకు పద్మ అవార్డులు దక్కడం లేదని మండిపడ్డారు.


Read Also… Singareni Mines: సింగరేణి బొగ్గు గనిలో విషాదం.. ఎస్‌ఆర్పీ-3 గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు దుర్మరణం