Minister Eshwarappa: కాంట్రాక్టర్ ఆత్మహత్య.. మంత్రి పై కేసు నమోదు.. మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్

|

Apr 13, 2022 | 3:22 PM

Karntaka Minister Eshwarappa: బీజేపీ (BJP) నాయకుడు, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్(Santosh Patil) మంగళవారం ఉడిపిలోని ఓ లాడ్జిలో శవమై కనిపించారు. కర్ణాటక గ్రామీణాభివృద్ధి,..

Minister Eshwarappa: కాంట్రాక్టర్ ఆత్మహత్య.. మంత్రి పై కేసు నమోదు.. మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్
Fir Against Karnataka Minis
Follow us on

Karntaka Minister Eshwarappa: బీజేపీ (BJP) నాయకుడు, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్(Santosh Patil) మంగళవారం ఉడిపిలోని ఓ లాడ్జిలో శవమై కనిపించారు. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై పాటిల్ ఇటీవల అవినీతి ఆరోపణలు చేశారు. తాను మంత్రి ఈశ్వరప్పకు కమీషన్లు ఇవ్వలేకపోతున్నా అని ఆరోపణ చేస్తూ.. సంతోషాలు పాటిల్ ఆత్మ హత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సివిల్ కాంట్రాక్టర్ మృతికి సంబంధించి కర్ణాటక గ్రామీణాభివృద్ధి,  పంచాయితీ రాజ్ (RDPR) మంత్రి KS ఈశ్వరప్పపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ కేసులో ఈశ్వరప్పను మొదటి ముద్దాయిగా చేర్చినట్లు చెప్పారు.  సంతోష్ పాటిల్ సోదరుడు ప్రశాంత్ పాటిల్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. పాటిల్ ఉడిపిలోని ఓ లాడ్జిలో అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పే తన ఆత్మహత్యకు కారణం అంటూ కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మంత్రి పదవి నుంచి ఈశ్వరప్పను తప్పించాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదే విషయంపై సంతోష్ సోదరుడు ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. మంత్రి ఈశ్వరప్ప, ఆయన సిబ్బంది రమేష్, బసవరాజ్‌లను నిందితులుగా పేర్కొన్నారు. హిండలగ గ్రామంలో తన సోదరుడు రూ.4 కోట్లతో పనులు చేపట్టాడని ప్రశాంత్ పాటిల్ చెప్పాడు. సంతోష్ తన డబ్బును ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టాడు. అయితే ఇప్పుడు ఆ పనికి సంబంధించిన బిల్లు పెండింగ్‌లో ఉంది. మంత్రి ఈశ్వరప్పను సంతోష్ పలుమార్లు పరామర్శించి ఆ మొత్తాన్ని విడుదల చేయాలని వేడుకున్నారు. అయితే మొత్తాన్ని విడుదల చేయాలంటే.. మంత్రి సన్నిహితుడు బసవరాజ్, రమేష్ 40 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పాటిల్ మృతి చెందిన ప్రదేశంలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలను పరిశీలించింది. పాటిల్ మరణం కారణం అంటూ  ప్రధానమంత్రి నరేంద్రమోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పలు ఆరోపణలు చేశారు. అంతేకాదు మంత్రి ఈశ్వరప్పను తొలగించాలని డిమాండ్ చేశారు.

Also Read:Tirumala: స్వామివారి సన్నిధిలో వారం రోజుల పాటు ఉండే భాగ్యం.. ఎలా అనుమతి తీసుకోవాలో పూర్తి వివరాలు మీ కోసం..