Viral video: బదిలీపై వెళ్తున్న పోలీస్.. వెళ్లొదంటూ వెక్కివెక్కి ఏడ్చిన జనం.. వైరల్‌ అవుతున్న వీడియో!

సాధారణంగా పోలీసులు అంటే అందరూ భయపడుతూ ఉంటారు.. ఇక స్ట్రిట్‌గా ఉండే పోలీసులు అంటే మరీ..అలాంటి వాళ్లు ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అవుతారా అని కొంతమంది చూస్తుంటారు..కానీ నార్త్‌ ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇందుకు పూర్తి బిన్నంగా ఉంది. ఓ పోలీస్ అధికారి ట్రాన్స్‌ఫర్‌పై వేరే ప్రాంతానికి వెళ్తుంటే స్థానిక జనం అంత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral video: బదిలీపై వెళ్తున్న పోలీస్.. వెళ్లొదంటూ వెక్కివెక్కి ఏడ్చిన జనం.. వైరల్‌ అవుతున్న వీడియో!
Police

Updated on: May 17, 2025 | 2:55 PM

ఓ పోలీస్ అధికారి ట్రాన్స్‌ఫర్‌పై వేరే ప్రాంతానికి వెళ్తుంటే స్థానిక జనం అంత కన్నీళ్లు పెట్టుకున్న ఘటన నార్త్ ఢిల్లీలోని సబ్జీమండి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సబ్జీమండి పోలీస్ స్టేషన్‌లో మిశ్రా అనే వ్యక్తి ఎస్‌హెచ్‌వో (SHO)గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు మరో ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. దీంతో అతని ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో స్టేషన్‌లోని తోటి సిబ్బందికి వెళ్తున్నట్టు చెప్పి స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాడు. అయితే అప్పటికే అతని కోసం బయట ఎదురుచూస్తున్న జనం ఆయనను చుట్టుముట్టారు. మీరు వెళ్లొద్దు ఇక్కడే ఉండండి అని మిశ్రాను కోరారు. కొందరైతే ఆయన అక్కడి నుంచి వెళ్లడం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన్ను కౌగిలించుకుని ఏడ్వడం స్టార్ట్‌ చేశారు.

అసలు ఓ పోలీస్ అధికారి వెళ్తుంటే సాధారణ జనం ఎందుకు ఇంతలా బాధపడుతున్నారంటే. ఆయన అక్కడ సర్వీస్‌లో ఉన్నన్ని రోజులు స్థానిక ప్రజలందరిలో మమేకంగా మెలిగేవారు. అక్కడి ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా అండగా ఉండేవారట అందుకే వాళ్లు ఇంతలా బాధపడుతున్నది.

మాకోసం 24/7 పనిచేసే మంచి పోలీస్ మిశ్రా ఆయన్ను బదిలీ చేయొద్దంటూ స్థానిక జనాలు మీడియా ద్వారా ఉన్నతాధికారులను వేడుకున్నాడు. మీశ్రా బదిలీని రద్దు చేసి ఇక్కడే ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అందరూ పోలీస్ అంటే ఇలా ఉండాలి అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..