Viral Video: కదులుతున్న రైలు ఎక్కుతూ జారి పడిన ప్రయాణీకుడు.. కాపాడిన కానిస్టేబుల్..షాకింగ్ వీడియో వైరల్

కొన్ని సార్లు ప్రయాణీకులు కదులుతున్న రైలు ఎక్కేందుకు లేదా దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో ఇలాంటి ఘటనలలో వేంగంగా స్పందించిన రైల్వే పోలీసులు ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన సంఘటనలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఇలాంటి ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.

Viral Video: కదులుతున్న రైలు ఎక్కుతూ జారి పడిన ప్రయాణీకుడు.. కాపాడిన కానిస్టేబుల్..షాకింగ్ వీడియో వైరల్
Police Constables Heroic Move

Updated on: Oct 04, 2024 | 3:12 PM

కదులుతున్న రైలు నుంచి దిగవద్దు.. కలిదే రైలుని ఎక్కేందుకు ప్రయత్నించవద్దు.. ప్రాణాపాయం అంటూ నిరంతరం రైల్వే సిబ్బంది వివిధ రైల్వే స్టేషన్స్ లో హెచ్చరిస్తూనే ఉంటారు. అంతేకాదు వివిధ రైల్వే ప్లాట్ ఫామ్ లపై రైల్వే పోలీసులు తమ విధులను నిర్వహిస్తూ ప్రయాణీకుల తగిన రక్షణ కల్పిస్తూనే ఉంటారు. అయినప్పటికీ కొన్ని సార్లు ప్రయాణీకులు కదులుతున్న రైలు ఎక్కేందుకు లేదా దిగేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో ఇలాంటి ఘటనలలో వేంగంగా స్పందించిన రైల్వే పోలీసులు ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన సంఘటనలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఇలాంటి ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్ లోని రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలుని ఎక్కేందుకు ఓ ప్రయాణీకుడు ప్రయాణిస్తూ.. ఎక్కడం వీలుకాక కింద పడిపోయాడు. అయితే అక్కడే విధులను నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ యోగేష్ వేగంగా స్పందించి ఆ ప్రయాణీకుడు రక్షించాడు. దీంతో ఆ ప్రయాణీకుడికి ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన అంతా అక్కడే ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రయాణీకుడు అంక్లేశ్వర్ కు చెందిన చౌహాన్ అని గుర్తించారు. వాఫై నుంచి బరూచ్ లోని తన స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అక్కడే ఉన్న రైల్వే పోలీసు కానిస్టేబుల్ సమయస్పూర్తితో వ్యవహరించి చౌహాన్ ప్రాణాలను కాపాడిన విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. యోగేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us