మధ్యప్రదేశ్ లో ఆన్ లైన్ గేమ్ ఆడుతూ 40 వేల రూపాయలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న 13 ఏళ్ళ బాలుడి ఉదంతంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చాత్తర్ పూర్ లో ఇటీవల జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు..’ఫ్రీ ఫైర్’ అనే ఈ గేమ్ డెవలపర్స్ పై కేసు దాఖలు చేశారు. రాష్ట్ర హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశంపై తాము కేసు పెట్టినట్టు వారు తెలిపారు. ఆరో తరగతి చదువుతున్న ఈ బాలుడు ఇలా ఈ గేమ్ ఆడుతూ సూసైడ్ చేసుకోవడం చాలా విచారకరమని నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఈ విధమైన ఆటలు పిల్లల మీద, యువకుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, వారి జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ విధమైన కంపెనీలపై లీగల్ చర్య తీసుకునే అవకాశాలపై న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరామని ఆయన తెలిపారు. ఫ్రీ ఫైర్ గేమ్ ని డెవలప్ చేసిన సంస్థపై ఐపీసీ లోని 305 సెక్షన్ కింద కేసు పెట్టినట్టు చాత్తర్ పూర్ పోలీసులు తెలిపారు. పైగా ఇలాంటి ఆటల్లో సొమ్ము లావాదేవీలు లేకుండా చేయడానికి సైబర్ సెల్ సాయం కూడా తీసుకుంటున్నామని వారు చెప్పారు.
తన తల్లికి చెందిన యూపీఐ అకౌంట్ నుంచి ఆమెకు తెలియకుండా 40 వేల రూపాయలు విత్ డ్రా చేసి ఈ గేమ్ లో పెట్టానని, కానీ నష్టపోయినందున సూసైడ్ చేసుకుంటున్నానని.., అందువల్ల తనను క్షమించాలని,ఈ కుర్రాడు తన సూసైడ్ నోట్ లో తన తల్లిని కోరాడు. లోగడ కూడా ఇదే రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో 12 ఏళ్ళ బాలుడు ఈ గేమ్ ఆడకుండా తన తండ్రి తన ఫోన్ లాక్కున్నందుకు సూసైడ్ చేసుకున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : ఫస్ట్ నైట్ రూమ్ ఒకే.. కానీ మనం..?పెళ్లికూతురి డౌట్ తో షాక్ లో వరుడు పెళ్ళికొడుకు..:First Night Funny video.
ఉద్యోగాలుల పేరుతో యువతను మోసం చేసిన కి’లేడీ’..నిరుద్యోగ అమాయకత్వమే పెట్టుబడి..:Job cheating Video.
ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్ పెట్టుకోలేదని..:Police attack Video.