ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రియుడ్ని పెళ్లి చేసుకునేందుకు ఇండియా వచ్చిన పోలాండ్ యువతి

|

Jul 23, 2023 | 4:28 PM

ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన సీమా పబ్జీ ఆటలో పరిచయమైన తన ప్రియుడి కోసం ఇండియాకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొంతమంది విదేశీ మహిళలు కూడా భారతీయుల్ని పెళ్లి చేసుకుంటారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రియుడ్ని పెళ్లి చేసుకునేందుకు ఇండియా వచ్చిన పోలాండ్ యువతి
Lovers
Follow us on

ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన సీమా పబ్జీ ఆటలో పరిచయమైన తన ప్రియుడి కోసం ఇండియాకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొంతమంది విదేశీ మహిళలు కూడా భారతీయుల్ని పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి తర్వాత కొందరు భారత్‌లోనే స్థిరపడిపోతారు. మరికొందరు విదేశాలకే వెళ్లిపోతుంటారు. ఇప్పుడు తాజాగా పోలాండ్‌కు చెందిన ఓ మహిళ తన ప్రియుడి కోసం జార్ఘండ్‌కు వచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే జార్ఘండ్‌లోని కటకంసాండీ బ్లాక్ పరిధిలో బరతువా అనే గ్రామంలో షాబాద్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అయితే ఇతనికి 2021లో ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా పోలాండ్‌కు చెందిన బార్బరా అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయమే ప్రేమగా మారింది.

దీంతో ఆమె పొలాండ్‌ను వదిలేసి తన ప్రియుడు షాబాద్ కోసం జార్ఖండ్‌కు వచ్చేసింది. మరో విషయం ఏంటంటే ఆమెకు ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. బరతువా గ్రామానికి ఆమె రావడంతో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బార్బరా.. తన ప్రియుడి ఇంట్లోనే ఉంటుంది. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. బార్బరా కూతురు కూడా షాబాద్‌ను డాడీ అని పిలుస్తోంది. తనకు ఇండియా బాగా నచ్చిందని.. ప్రస్తుతం స్థానికులు తనని ఓ సెలబ్రిటీలా చూస్తున్నారని బార్బరా తెలిపింది.