
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమైంది. మార్చి 16న మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేరా దేశ్, మేరా పరివార్ అంటూ ఒక ట్వీట్ చేస్తూ దానికి ప్రతిగా వీడియోని షేర్ చేశారు. అంటే నా దేశం, నా కుటుంబం ఎలా ఉందో చూపిస్తూ ఈ వీడియో సాగుతుంది. ఇందులో మై హూ మోదీ జీ కా పరివార్ అనే పాటను లాంచ్ చేశారు. ఈ వీడియోకు తగినట్లు తమ సంక్షేమం, అభివృద్ది గురించి చూపించారు. తన దశాబ్ధ పాలనలో స్వయం ఉపాధి లభించిన వారి చిరునవ్వులను చూపించారు. అలాగే మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న కుటుంబాల వెలుగులను చూపించారు.
దీంతో పాటు రైతుల కష్టాలను కడచేర్చేలా కిసాన్ సఫల్ యోజన కింద అందిన పెట్టుబడిసాయం గురించి వివరించారు. దేశంలో లక్షల కుటుంబాలను మంచినీటి కుళాయి కనెక్షన్లు అందించి వారి దాహార్తిని తీర్చినట్లు చూపించారు. కనీస అవసరాల్లో భాగమైన గూడు గురించి కోట్ల ఇండ్ల నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వృద్ద, వితంతు, వికలాంగులకు చేసిన సాయాన్ని వివరించారు. ఇలా వికసిత్ భారత్ లో భాగంగా ప్రతి పేద కుటుంబం ఏదో ఒక విధంగా లబ్ధిపొందిన విధానాన్ని క్లుప్తంగా వివరించారు. అందులో భాగంగానే కొంత మంది కుటుంబ సభ్యులు మై మోదీ జీ కా పరివార్ హూ అనే సందేశాన్ని ఇస్తున్నట్లు చిత్రీకరించారు.
मेरा भारत, मेरा परिवार! pic.twitter.com/GzkIIvEIUb
— Narendra Modi (@narendramodi) March 16, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..