ఆశ్చర్యం ! కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కు నిండు సభలో ప్రధాని మోదీ ప్రశంస ! ఎందుకు ?

| Edited By: Pardhasaradhi Peri

Feb 08, 2021 | 2:15 PM

కాంగ్రెస్ సీనియర్  నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ని ప్రధాని మోదీ ప్రశంసించి కొత్త ఒరవడి సృష్టించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు..

ఆశ్చర్యం ! కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కు నిండు సభలో ప్రధాని మోదీ ప్రశంస ! ఎందుకు ?
Follow us on

కాంగ్రెస్ సీనియర్  నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ని ప్రధాని మోదీ ప్రశంసించి కొత్త ఒరవడి సృష్టించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, పార్టీ నాయకత్వానికి 23 మంది నేతలు రాసిన వివాదాస్పద లేఖ గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. తన సొంత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ పైన, ఇటీవల అక్కడ జరిగిన స్థానిక ఎన్నికలపైన గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన మోదీ.. ఆజాద్ ఎప్పుడూ డీసెంట్ గా మాట్లాడుతారని, ఎన్నడూ అనుచిత భాష వాడరని అన్నారు. ఆయన నుంచి మనం ఇదే నేర్చుకోవాలని, ఆయన అంటే  తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో స్థానిక ఎన్నికలను ఆజాద్ ప్రశంసించారని, అయితే తనకు కాస్త విచారం కూడా కలుగుతోందని అన్నారు. ‘జీ-23’ (కాంగ్రెస్ నాయకత్వానికి లేఖ రాసిన 23 మంది గ్రూప్) కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలుగా ఆ పార్టీ వాటిని  పరిగణించబోదని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికజరగాలని, సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని, పార్టీ వర్కింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని..ఇలా ఎన్నో డిమాండ్లతో లోగడ పార్టీ అధినేత్రికి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఆజాద్ కూడా ఒకరు. ఆ లేఖ అప్పుడు ప్రకంపనలనే సృష్టించింది. మొత్తానికి కొద్దిరోజులకే అది టీ కప్ లో తుఫానులా చల్లారిపోయింది.

ఇక రాజ్యసభలో విపక్షాలపై మోదీ విమర్సనాస్త్రాలు సంధించారు. ‘నన్ను మీరు కొంతవరకు వినియోగించుకున్నందుకు సంతోషిస్తున్నా.. కరోనా సంక్షోభ సమయంలో మీరు ఇళ్లలో చాలా సమయం గడిపి ఉంటారు..ఇప్పుడు కాస్త వెసులుబాటు దొరికింది గనుక..నా మీద కోపాన్ని చూపుతూ లైట్ గా ఫీల్ అవుతున్నారని భావిస్తున్నా’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘మోదీ ఇక్కడే ఉన్నారు..ఇదే మీకు అవకాశం’ అని ఆయన చమత్కరించారు.