పైరసీకి చెక్ పెట్టాలంటే సముద్ర మార్గం ద్వారా వాణిజ్యంపై గల పరిమితులు (ఆంక్షలు) తొలగాల్సిందేనని ప్రధాని మోదీ అన్నారు. వీటిని పైరసీ కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సముద్ర సంబంధ పర్యావరణాన్ని మనం రక్షించుకోవలసి ఉందన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ కి స్వస్తి చెప్పాలని, ఓవర్ ఫిషింగ్ సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే అవసరానికి మించి మత్స్య సంపదను కొల్లగొట్టడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. సముద్ర మార్గాల ద్వారా దేశాల మధ్య సాన్నిహిత్యం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఉద్దేశించి ఆయన వర్చ్యువల్ గా ప్రసంగించారు.,ఐరాసలో ఇలా ఓ డిబేట్ కి అధ్యక్షత వహించిన తొలి భారత ప్రధాని అయ్యారు. ఈ నెలకు గాను ఫ్రాన్స్ నుంచి ఐరాస భద్రతా మండలికి అధ్యక్ష స్థానాన్ని ఇండియా స్వీకరించిన సంగతి విదితమే. ఉన్నత స్థాయిన జరిగిన డిబేట్ లో మారిటైమ్ సెక్యూరిటీ (సముద్ర భద్రత) ఫై చర్చ జరగడం ఇదే ప్రథమం. 2015 లోనే మోదీ..’సాగర్’ విజన్ గురించి ప్రస్తావించారు. ‘సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజన్’ అన్నదే దీని ఉద్దేశం.
అన్ని దేశాలూ తమలో తాము సహకరించుకోవాలంటే సముద్ర మార్గాలను వినియోగించుకోవాలన్నదే ఈ విజన్ ధ్యేయం కూడా.. 2019 లో ఈస్ట్ ఏషియా సమ్మిట్ లో కూడా ఇండో-పసిఫిక్ ఓషన్ ఇనీషియేటివ్ ద్వారా దీనిపై విస్తృత చర్చ జరిగింది. కాగా ఐరాస భద్రతా మండలికి ఇండియా అధ్యక్షత వహించడం ఇది పదో సారి. ఈ వేదికపై ఇండియా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు.. వ్యభిచారానికి అడ్డగా బందర్ బీచ్..:Tourist Areas Video.
West Bengal: మమత బెనర్జీకి పొంచి ఉన్న పదవి గండం.. సీఎం పదవికి రాజీనామా చేస్తారా(వీడియో).
Big News Big Debate LIVE Video: ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చేంత సత్తా కమలనాథులకుందా?