PM Narendra Modi: గోదావరి తీరాన ఉన్న శ్రీకాలరామ మందిరాన్ని సందర్శనకు ప్రధాని నరేంద్ర మోదీ

|

Jan 12, 2024 | 12:26 PM

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు, శ్రీరాముని మరొక ఆలయం ప్రధాన వార్తల్లో నిలిచింది. ఈ ఆలయాన్ని కాలరామ్ దేవాలయం అంటారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. శుక్రవారం జనవరి12న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు.

PM Narendra Modi: గోదావరి తీరాన ఉన్న శ్రీకాలరామ మందిరాన్ని సందర్శనకు ప్రధాని నరేంద్ర మోదీ
Pm Narendra Modi Visiting Shree Kala Ram Mandir
Follow us on

జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠాపనకు దేశ వ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. అయితే, అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు, శ్రీరాముని మరొక ఆలయం ప్రధాన వార్తల్లో నిలిచింది. ఈ ఆలయాన్ని కాలరామ్ దేవాలయం అంటారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. శుక్రవారం జనవరి12న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు.

నాసిక్‌లోని గోదావరి తీరాన ఉన్న శ్రీ కాలరామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సందర్శిస్తున్నారు. శ్రీ కళా రామ మందిరం నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో ఉంది. రామాయణానికి సంబంధించిన ప్రదేశాలలో పంచవటికి ప్రత్యేక స్థానం ఉంది రామాయణంలోని అనేక ముఖ్యమైన సంఘటనలు ఇక్కడ జరిగాయట. రాముడు, సీత, లక్ష్మణుడు పంచవటి ప్రాంతంలో ఉన్న దండకారణ్య అడవిలో కొన్ని సంవత్సరాలు గడిపారు. పంచవటి అనే పేరుకు 5 మర్రి చెట్ల భూమి అని అర్థం. 5 మర్రి చెట్లు ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని పవిత్రంగా మార్చినందున రాముడు ఇక్కడ తన కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడని పురాణం. అయోధ్యలోని భవ్య రామ మందిర ‘ప్రాణ-ప్రతిష్ఠ’ వేడుకకు కేవలం 10 రోజుల ముందు ప్రధాని మోదీ ఈ ప్రదేశాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మహాకవి తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లో పంచవటి ధామ్ గురించి ఒక పద్యంలో వివరించారు. నాసిక్‌లో ఉన్న పంచవటి ప్రాంతానికి శ్రీరాముడితో ప్రత్యేక అనుబంధం ఉంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున స్థాపించబడిన పంచవటి ధామ్ ఉంది. ఇక్కడ శ్రీరాముడు, సీత దేవి, లక్ష్మణ్ 14 సంవత్సరాల అజ్ఞాతవాసంలో కొంతకాలం పర్ణకుటిలో నివసించారు. వారి అజ్ఞాతవాస సమయంలో ఈ ప్రదేశంలో శ్రీ రాముడు, జానకి నిర్మించిన గుడిసె ఉండేదట. సత్యయుగంలో ఈ ప్రదేశాన్ని దండకారణ్యంగా పిలిచేవారు.

శ్రీరాముడు వనవాస సమయంలో పంచవటికి వచ్చినప్పుడు, రాక్షసుల నుండి విడిపించమని ఋషులు ప్రార్థించారు. అప్పుడు శ్రీరాముడు, వారి ప్రార్థనను అంగీకరించి, నల్లని రూపాన్ని ధరించి, ఆ రాక్షసుల నుండి వారిని విడిపించారు. నేటికీ, శ్రీ రాముడు, మాత సీత, లక్ష్మణ్, హనుమాన్ నల్ల విగ్రహాలు ఆలయ గర్భగుడిలో ఉన్నాయి. 1782లో సర్దార్ రంగ్ రావ్ ఒదేకర్ పాత చెక్క దేవాలయం స్థానంలో శాశ్వత ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం 12 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇందులో 2000 మందికి పైగా కళాకారులు నిర్మాణంలో పాల్గొన్నారని చరిత్ర చెబుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…