PM Modi: నేడు సోమనాథ్‌లో సౌరాష్ట్ర తమిళ సంగమం ముగింపు కార్యక్రమం.. ప్రసంగించనున్న ప్రధాని మోదీ..

|

Apr 26, 2023 | 11:41 AM

Saurashtra Tamil Sangamam: బుధవారం నాడు సౌరాష్ట్ర తమిళ సంగమం ముగింపు కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10.30 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రోత్సహిస్తుందని..

PM Modi: నేడు సోమనాథ్‌లో సౌరాష్ట్ర తమిళ సంగమం ముగింపు కార్యక్రమం.. ప్రసంగించనున్న ప్రధాని మోదీ..
PM Modi
Follow us on

బుధవారం నాడు సౌరాష్ట్ర తమిళ సంగమం ముగింపు కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10.30 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రోత్సహిస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమం వివిధ ప్రాంతాల్లోని ప్రజల మధ్య పురాతన సంబంధాలను తిరిగి కలపడంలో సహాయపడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాశీ తమిళ సంగమం నిర్వహించడం జరిగిందని పీఎంవో ప్రకటనలో పేర్కొన్నారు.

గుజరాత్, తమిళనాడు మధ్య భాగస్వామ్య సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేుస్తూ సౌరాష్ట్ర తమిళ సంగమం కార్యక్రమం నిర్వహించడం ద్వారా భవిష్యత్‌లో మంచి పరిణామాలుంటాయని పీఎంవో పేర్కొంది. శతాబ్దాల క్రితం సౌరాష్ట్ర ప్రాంతం నుంచి చాలా మంది తమిళనాడుకు వలస వచ్చారు. సౌరాష్ట్ర తమిళ సంగమం సౌరాష్ట్ర తమిళులు తమ మూలాలతో మళ్లీ కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కల్పించిందని పీఎంవో ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

10 రోజుల సంగమంలో 3000 మందికి పైగా సౌరాష్ట్ర తమిళులు ప్రత్యేక రైలులో సోమనాథ్ వచ్చారు. ఏప్రిల్ 17న ప్రారంభమవగా.. ముగింపు కార్యక్రమం ఏప్రిల్ 26న అంటే నేడు సోమనాథ్‌లో జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..