PM Narendra Modi interact with startups: దేశంలోని స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం 150 స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్స్, స్పేస్, ఇండస్ట్రీ 4.0, సెక్యూరిటీ, ఫిన్‌టెక్, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం లాంటి పలు రంగాలకు చెందిన 150కి పైగా స్టార్టప్‌ల ప్రతినిధులతో సంభాషించారు. స్టార్టప్‌ల అభివృద్ధి, ఆర్థికపరమైన చేయూత, ప్రభుత్వం సహాయం, భవిష్యత్తు సాంకేతికత, ప్రపంచస్థాయిలో భారతదేశాన్ని అగ్రగ్రామిగా నిలిపే అంశాలపై ప్రధాని మోదీ సంభాషించారు. భారతదేశంలోని స్టార్టప్‌లు దేశానికి వెన్నముకగా నిలుస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తంచేశారు. దీనిలో భాగంగా జనవరి 16న నేషనల్ స్టార్టప్ డేగా జరుపుకోబోతున్నామని తెలిపారు. స్టార్టప్‌లకు మేలు చేసే విధంగా దేశంలో నియమాలను సైతం మార్చనున్నట్లు పేర్కొన్నారు. స్టార్టప్ ప్రపంచంలో భారత పతాకాన్ని ఎగురవేస్తున్న వారందరికీ మోదీ అభినందించారు. స్టార్టప్‌లకు సంబంధించి కేంద్రం కూడా పెద్ద ఎత్తున మార్పులు చేస్తుందని మోదీ పేర్కొన్నారు.
దేశంలో సెమీ అర్భన్, గ్రామీణ ప్రాంతాలు ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని.. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు స్టార్టప్‌లను సంప్రదించాలన్నారు. దేశం కోసం నూతన ఆవిష్కరణలు చేద్దామంటూ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనికోసం జిల్లా స్థాయిలో కొత్త స్టార్టప్‌లు రావాలంటూ మోదీ సూచించారు. 2013-14లో 4వేల స్టార్టప్‌లు మాత్రమే ఉండగా.. గతేడాది ఈ సంఖ్య 28 వేలకు చేరిందన్నారు. యువత మరిన్ని ఆలోచనలు చేసి ప్రపంచంలో భారత్ పేరును అగ్రగ్రామిగా నిలపాలని మోదీ సూచించారు.
స్టార్టప్‌ల స్వర్ణకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని.. మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలకు సంబంధించి భారత్ గ్లోబల్ ఇండెక్స్‌లో మెరుగుపడుతుందని మోదీ పేర్కొన్నారు. 2015లో ఈ ర్యాంకు 81వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు 46వ స్థానానికి చేరిందని ప్రధాని పేర్కొన్నారు.
Also Read: