భారత్‌లో మరోసారి కరోనా కలవరపెడుతోంది. దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిత్యం 1000కి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 1100 కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాల్లో కరోనా కేసులో 260 శాతం పెరిగాయి. చాపకింద నీరులా కరోనా విస్తరించడంతో కేంద్రం అలర్టయ్యింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 8 రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. . ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కట్డడికి తీసుకోవాల్సిన చర్యలపై మోదీ సమీక్షిస్తున్నారు.
ఢిల్లీలో జరిగిన సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోసారి కొవిడ్ తీవ్రరూపు దాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రజారోగ్య వ్యవస్థలు సన్నద్ధమవ్వాల్సిన తీరుపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో చర్చించారు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,134 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక మహహ్మరి ధాటి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా ఐదుగురు మరణించారని అధికారులు పేర్కొన్నారు. కేంద్రం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 7,026 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత కొంతకాలంగా కరోనా మరణాలేవీ లేకపోగా, ఇటీవల మళ్లీ మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చత్తీస్ గఢ్, కేరళ, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో ఒక్కో మరణం నమోదయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.