PM Narendra Modi: కాన్పూర్ మెట్రోలో ప్రధాని మోదీ.. పలు అభివృ‌ద్ధి పనులకు శ్రీకారం..

PM Modi UP Tour: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో పర్యటిస్తున్నారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 54వ

PM Narendra Modi: కాన్పూర్ మెట్రోలో ప్రధాని మోదీ.. పలు అభివృ‌ద్ధి పనులకు శ్రీకారం..
Pm Modi

Edited By:

Updated on: Dec 28, 2021 | 5:37 PM

PM Modi UP Tour: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో పర్యటిస్తున్నారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 54వ (ఐఐటి కాన్పూర్) స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మెట్రోలో ప్రయాణించారు. దీంతోపాటు ప్రధాని మోదీ బినా పంకీ మల్టీప్రొడక్ట్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ విభాగాన్ని కూడా ప్రారంభించారు. కాన్పూర్ పట్టణ ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ మొత్తం 9 కి.మీ పొడవు ఐఐటి కాన్పూర్ నుండి మోతీ జీల్ వరకు విస్తరించి ఉంది. అయితే, కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం పొడవు 32 కి.మీ. ఇది రూ. 11,000 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో ప్రాజెక్టుగా కాన్పూర్ మెట్రో అవతరించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అంతకుముందు కాన్పూర్ ఐఐటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే యుగం విద్యార్థులకు సువర్ణవకాశమని ప్రధాని మోదీ పేర్కొ్న్నారు. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా అవతరించిందని.. ఈ ఘటన ప్రధానంగా ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థుల సహాయంతో సాధించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కాలేజీ నుంచి బయటకి అడుగు పెట్టగానే విద్యార్థులు విజయానికి షార్ట్‌కట్‌లతో ఆలోచిస్తారన్నారు. చాలా మంది కంఫర్ట్ కోసం అన్వేషిస్తారని.. కంఫర్ట్ కంటే ఛాలెంజ్ ఎంచుకోవాలని సూచించారు. సవాళ్లను ఎదుర్కొని వాటిని సమర్ధవంతమైన పరిష్కారాలతో అధిగమించే వారే అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు.

నేడు మన చుట్టూ సాంకేతికత ఉన్నప్పటికీ.. మనం మానవులమని మరచిపోకూడదంటూ ప్రధాని మోదీ సూచించారు. మనకు మనం రోబో వెర్షన్‌లుగా మారకూడదని.. కృత్రిమ మేధస్సును అన్వేషించాలన్నారు. ఎప్పడూ మానవ మేధస్సును విస్మరించకూడదంటూ ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు.

Also Read:

PM Modi Car: అప్‌గ్రేడ్ అయిన ప్రధాని మోడీ కారు.. ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Covid Vaccine: గుడ్‌న్యూస్.. దేశంలో మరో రెండు కరోనా వ్యాక్సిన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..