PM Narendra Modi: ప్రధాని మోదీకి ఇష్టమైన ఫోన్.. హ్యాక్, ట్రాక్ చేయడం అసాధ్యం..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (సెప్టెంబర్ 17) తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా, సురక్షితమైన కమ్యూనికేషన్ కోసం PM మోదీ ఏ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం. ఈ ఫోన్ పేరును మాత్రమే కాకుండా, దానిని ఎవరు రూపొందించారు. దాని ప్రత్యేక లక్షణాల గురించి సమాచారాన్ని తెలుసుకుందాం.

PM Narendra Modi: ప్రధాని మోదీకి ఇష్టమైన ఫోన్.. హ్యాక్, ట్రాక్ చేయడం అసాధ్యం..!
Pm Modi Favorite Phone

Updated on: Sep 17, 2025 | 11:59 AM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి కొత్త సమాచారం తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉంటారు. ఈరోజు (సెప్టెంబర్ 17), ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు జరపుకుంటున్నారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ ఏ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం. మీలో చాలా మందికి ఈ ప్రశ్నకు ఇప్పటికే సమాధానం ఉండవచ్చు. కానీ ప్రధాని కమ్యూనికేషన్ కోసం ఏ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారో కూడా తెలియని వారు చాలా మంది ఉన్నారు.

ముఖ్యంగా కాల్స్ సమయంలో సున్నితమైన సమాచారాన్ని పంచుకునే ప్రభుత్వ అధికారులకు సురక్షితమైన కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యమైనది. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన బ్లాగ్ ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సురక్షితమైన కమ్యూనికేషన్ కోసం RAX ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.

RAX ఫోన్ ప్రత్యేకత ఏమిటి?

అధునాతన భద్రతా లక్షణాలు, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లతో వచ్చే ఈ ఫోన్‌ను సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) అభివృద్ధి చేసింది. ఈ అధునాతన ఫీచర్‌లు ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితమైన కమ్యూనికేషన్‌లను అందించడానికి రూపొందించడం జరిగింది. దీని కారణంగా, ఈ పరికరం అత్యంత సురక్షితమైనది, హ్యాక్ చేయడం లేదా ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యం. మిలిటరీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లపై పనిచేసే ఈ ఫోన్ మూడు పొరల ఎన్‌క్రిప్టెడ్ భద్రతను కలిగి ఉంది. వీటిని విచ్ఛిన్నం చేయడం దాదాపు అసాధ్యం.

వేలిముద్ర గుర్తింపు: ఈ ఫోన్ పనిచేయడానికి వేలిముద్ర గుర్తింపు అవసరం. అధికారం ఉన్న వినియోగదారులు మాత్రమే పరికరాన్ని ఉపయోగించగలరని నిర్ధారిస్తుంది.

లైవ్ పిక్చర్ వెరిఫికేషన్: ఈ ఫోన్ కాల్ సమయంలో కాలర్ లైవ్ పిక్చర్‌ను చూపిస్తుంది. తద్వారా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

హ్యాండ్‌సెట్-స్టేజ్ ఎన్‌క్రిప్షన్: కమ్యూనికేషన్ హ్యాండ్‌సెట్ స్థాయిలో ఎన్‌క్రిప్ట్ చేయడం జరుగుతుంది. దీని వలన ట్యాప్ చేయడం లేదా ట్రాక్ చేయడం, హ్యాక్ చేయడం కష్టమవుతుంది.

ప్రభుత్వ స్థాయి భద్రత: RAX ఫోన్‌లను NTRO-DEITY వంటి ఏజెన్సీలు పర్యవేక్షిస్తాయి.

భారతదేశంలో RAX ఫోన్ ధర ఎంత: ప్రభుత్వ అధికారులకు భారతదేశంలో RAX ఫోన్ ఖచ్చితమైన ధర బహిరంగంగా వెల్లడించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..