పోలీసుల తీరును నిరసిస్తూ ప్రధాని సోదరుడి నిరాహారదీక్ష.. ఇంతకీ లక్నో ఎయిర్‌పోర్టులో ఎం జరిగిందంటే..?

|

Feb 04, 2021 | 8:46 PM

తనకు స్వాగతం పలికేందుకు వచ్చినవారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆగ్రహనికి గురైన ప్రహ్లాద్ మోదీ విమానాశ్రయంలోనే ఓ కూర్చిలో కూర్చుని నిరసన తెలిపారు.

పోలీసుల తీరును నిరసిస్తూ ప్రధాని సోదరుడి నిరాహారదీక్ష.. ఇంతకీ లక్నో ఎయిర్‌పోర్టులో ఎం జరిగిందంటే..?
Follow us on

Prahlad Modi protest at Lucknow airport : స్వయాన భారత ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కోపమొచ్చింది. పోలీసు తీరుతో ఊగిపోయాడు. తనవారిని విడిపించుకునేందుకు నిరాహారదీక్షకు పూనుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో విమానాశ్రయంలో నిరసన తెలిపారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చినవారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆగ్రహనికి గురైన ప్రహ్లాద్.. విమానాశ్రయంలోనే ఓ కూర్చిలో కూర్చుని నిరసన తెలిపారు. తీరా ఉన్నతాధికారుల జోక్యంతో అందరిని విడుదల చేయడంతో మోదీ నిరాహారదీక్ష విరమించారు.

ఈ సందర్భంగా ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ.. “ఈ రోజు, నేను ప్రయాగరాజ్ వెళ్ళవలసి ఉంది, నా కార్యక్రమాలు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. నా మద్దతుదారులు జైలులో ఉన్నప్పుడు నేను బయట స్వేచ్ఛగా వెళ్లితే, అన్యాయం అవుతుంది. అందువల్ల, నేను ఇక్కడ లక్నో విమానాశ్రయంలో నిరహార దీక్షతో కూర్చోవాలని నిర్ణయించుకున్నాను. నేను నీరు, ఆహారాన్ని ముట్టుకోను. నా జీవితం ముగిసినా నేను ఇక్కడి నుంచి కదలను” అంటూ ప్రహ్లాద్ మోదీ స్పష్టం చేశారు.

ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు ఇది జరిగిందని పోలీసులు చెప్పరాన్న ఆయన.. ఆర్డర్ కాపీని చూపించేందుకు వారు నిరాకరించారన్నారు. ప్రధాని పేరును చెడగొట్టేందుకు ఇలా చేస్తున్నారో, లేక నిజంగా జరిగిందో తెలియదని ఆయన అన్నారు.

కాగా, విమానాశ్రయంలోని హై సెక్యూరిటీ జోన్ వద్ద విధించిన 144 సెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రహ్లాద్ మోదీ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. విమానాశ్రయం వద్దకు సుమారు 100 మంది వరకు తన మద్దతుదారులు వచ్చినట్లు ప్రహ్లాద్ మోదీ తెలిపారు. మద్దతుదారులను వదిలివేసిన గంటన్నర తర్వాత ప్రహ్లాద్ మోదీ దీక్ష విరమించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లిపోయారు.

ఇదిలావుంటే, విమనాశ్రయ అడిషనల్ జనరల్ మేనేజర్(ఆపరేషన్స్) భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఇండిగో విమానంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రహ్లాద్ మోదీ లక్నోకు వచ్చారని తెలిపారు. అయితే, తన మద్దతుదారులను తన వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ప్రహ్లాద్ మోదీ సుమారు గంటన్నరపాటు విమానాశ్రయంలో నిరసనకు దిగారని చెప్పారు. ఆ తర్వాత తన మద్దతుదారులను పోలీసులు విడిచిపెట్టడంతో ప్రహ్లాద్ మోదీ అక్కడ్నుంచి వెళ్లిపోయారని తెలిపారు.

Read Also…. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోల్ రాజీనామా.. ఆయన అందుకోసమే వైదొలిగారా..?