AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నేను చెప్పినట్లు ఇది ట్రైలర్‌ మాత్రమే.. దేశ ఆర్థిక వృద్ధిపై మోదీ ట్వీట్‌

మార్చి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. దీంతో వార్షిక వృద్ధిరేటు 8.2 శాతనికి ఎగబాకింది. ఇదిలా ఉంటే డిసెంబర్‌ త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ.. గతేడాది జనవరి-మార్చితో పోలిస్తే మెరుగైన ఫలితాలు నమోదుకావడం విశేషం. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో జీడీపీ 6.2 శాతంగా నమోదైంది...

PM Modi: నేను చెప్పినట్లు ఇది ట్రైలర్‌ మాత్రమే.. దేశ ఆర్థిక వృద్ధిపై మోదీ ట్వీట్‌
PM Modi
Narender Vaitla
|

Updated on: May 31, 2024 | 9:04 PM

Share

భారత ఆర్థిక వృద్ధి రేటు జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతోంది. మేకిన్‌ ఇండియా నినాదం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. కారణం ఏదైనా దేశ ఆర్థిక రంగంలో భారీగా వృద్ధికనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మైలును దాటింది. గతంతో పోల్చితే అత్యధికంగా నమోదై సరికొత్త రికార్డును సృష్టించింది.

మార్చి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. దీంతో వార్షిక వృద్ధిరేటు 8.2 శాతనికి ఎగబాకింది. ఇదిలా ఉంటే డిసెంబర్‌ త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ.. గతేడాది జనవరి-మార్చితో పోలిస్తే మెరుగైన ఫలితాలు నమోదుకావడం విశేషం. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో జీడీపీ 6.2 శాతంగా నమోదైంది.

ఇదిలా ఉంటే 2022-23 ఏడాదిలో 7 శాతంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధి చెందిందని NSO డేటా వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ రేటు 7.7 శాతంగా అంచనా వేసింది. అయితే, NSO రెండవ ముందస్తు అంచనాను కూడా అధిగమించి 2023-24 వార్షిక వృద్ధిరేటు 8.2గా నమోదుకావడం విశేషం. తయారీ రంగం బలమైన పనితీరు కారణంగా గతేడాదితో పోల్చితే మంచి వృద్ధిరేటు నమోదైంది. 2024 మొదటి మూడు నెలల్లో చైనా 5.3% ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది, అదే కాలంలో భారతదేశం యొక్క బలమైన ఆర్థిక పనితీరును హైలైట్ చేస్తుంది.

మోదీ ట్వీట్..

దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విషయమై ట్విట్టర్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఈ విషయమై మోదీ.. 2023-24 ఏడాదికి సంబంధించి క్యూ4 జీడీపీ వృద్ధి డేటా మన ఆర్థిక వ్యవస్థలో బలమైన ప్రదర్శనను చూపుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగవంతం కానుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు, 2023-24 సంవత్సరానికి 8.2% వృద్ధి చెందడం చూస్తుంటే.. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని ఉదాహరణగా చెప్పవచ్చని మోదీ అన్నారు. తాను చెప్పినట్లు దేశాభివృద్ధికి ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి