29 ఏళ్ళ తరువాత, మళ్ళీ నేడు అయోధ్యకు ప్రధాని మోదీ

| Edited By: Anil kumar poka

Aug 05, 2020 | 10:01 AM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి జరగనున్న భూమిపూజలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మరికొద్దిసేపట్లో  లక్నో నుంచి అయోధ్య చేరుకోనున్నారు. 29 ఏళ్ళ అనంతరం ఆయన అయోధ్యను సందర్శించడం ఇదే మొదటిసారి.

29 ఏళ్ళ తరువాత, మళ్ళీ నేడు అయోధ్యకు ప్రధాని మోదీ
Follow us on

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి జరగనున్న భూమిపూజలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మరికొద్దిసేపట్లో  లక్నో నుంచి అయోధ్య చేరుకోనున్నారు. 29 ఏళ్ళ అనంతరం ఆయన అయోధ్యను సందర్శించడం ఇదే మొదటిసారి. భూమి పూజ సందర్భంగా 40 కేజీల బరువైన వెండి ఇటుకను ఆయన శంకు స్థాపన స్థలంలో ఉంచనున్నారు. హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడికి పూజలు చేసిన అనంతరం మోదీ భూమిపూజ జరిగే స్థలానికి చేరుకుంటారు. 1990 లోనే  మోదీ ఇక్కడ రామాలయ నిర్మాణం కోసం విశేష కృషి చేశారు. జాతీయ ఎన్నికల ప్రస్థానంలో బీజేపీకి ఈ ఆలయ నిర్మాణం అత్యంత ప్రాధాన్యతా అంశంగా మారింది.

మోదీతో బాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇతర వీవీఐపీలు సుమారు 50 మంది తొలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా సెలబ్రేషన్స్ ని చాలావరకు కుదించారు. అయోధ్య కేసులో లిటిగెంట్ అయిన ముస్లిం గురువు ఇక్బాల్ అన్సారీకి కూడా ఇన్విటేషన్ అందిన సంగతి తెలిసిందే. బీజేపీ కురువృధ్ధుడు ఎల్.కె.అద్వానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనికి ‘అటెండ్’ కానున్నారు. బాబా రామ్ దేవ్ ఈ ఉదయమే తన సహచరులతో హనుమాన్ గర్హి ఆలయానికి చేరుకున్నారు.