అక్టోబర్ 29, అంటే ఈ రోజు ధన్తేరస్ పండుగనే కాకుండా ఆయుర్వేద దినోత్సవం కూడా ఈ రోజే జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశంలోని పెద్దలకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెద్ద కానుక ఇవ్వనున్నారు. 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరి కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)ను ప్రారంభించనున్నారు.
ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య సేవలను అందించేందుకు ఆయుష్మాన్ భారత్‌ను కూడా విస్తరించనున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్, వెల్‌నెస్ పట్ల ఉత్సాహం ఉన్న ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
“రేపు, ఆయుర్వేద దినోత్సవం నాడు మధ్యాహ్నం 12:30 గంటలకు, ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన ముఖ్యమైన పథకాలు ప్రారంభించబడతాయి. ఒక చారిత్రాత్మక తరుణంలో, 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య సంరక్షణ అందించే పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఆయుష్మాన్ భారత్‌ను విస్తరిస్తారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ వెల్‌నెస్ పట్ల మక్కువ ఉన్న వారందరూ రేపటి కార్యక్రమంలో చేరాలని’ మోదీ ట్విట్ చేశారు.
Tomorrow, on Ayurveda Day at around 12:30 PM, important schemes relating to the healthcare sector would either be launched or their foundation stones will be laid. In a historic moment, Ayushman Bharat will be expanded by launching the scheme to provide healthcare to all those…
— Narendra Modi (@narendramodi) October 28, 2024