PM Modi in Tejas Jet : యుద్ద సైనికుడిగా స్టైలిష్ లుక్‌లో ప్రధాని మోదీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాసేపు యుద్ద సైనికుడిగా అవతారమెత్తారు. లైట్ గ్రీన్ కలర్ డ్రస్సు వేసి.. కళ్లకు నల్లటి కూలింగ్ గ్లాసెస్ పెట్టి.. చేతిలో హెల్మెట్ పట్టుకొని స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ జోడించారు. హాలీవుడ్ హీరో లెవెల్లో నడుచుకుంటూ వస్తున్న నరేంద్ర మోదీని చూసి అందరూ షాక్‌కి గురయ్యారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్‌ను సందర్శించారు మోదీ.

PM Modi in Tejas Jet : యుద్ద సైనికుడిగా స్టైలిష్ లుక్‌లో ప్రధాని మోదీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Pm Modi Takes Sortie In Tejas Fighter Jet In Bengaluru Watch Video

Updated on: Nov 25, 2023 | 6:32 PM

దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాసేపు యుద్ద సైనికుడిగా అవతారమెత్తారు. లైట్ గ్రీన్ కలర్ డ్రస్సు వేసి.. కళ్లకు నల్లటి కూలింగ్ గ్లాసెస్ పెట్టి.. చేతిలో హెల్మెట్ పట్టుకొని స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ జోడించారు. హాలీవుడ్ హీరో లెవెల్లో నడుచుకుంటూ వస్తున్న నరేంద్ర మోదీని చూసి అందరూ షాక్‌కి గురయ్యారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్‌ను సందర్శించారు మోదీ. ఈ క్రమంలో అక్కడి ఉన్నతాధికారులు మోదీకి స్వాగతం పలికారు. విమానంలో ప్రయాణించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆ తరువాత ప్రధాని మోదీ తేజస్ యుద్ధ విమానంలో గగనతలంపై ప్రయాణించారు. ఒకవైపు నీలాకాశం, మరో వైపు మంచు దిమ్మెల్లాంటి తెల్లని మేఘాల మధ్య ప్రయాణం చేస్తూ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. గాల్లో తేలుతూ విజయానికి సంకేతంగా థంబ్ గుర్తును చూపించారు. ఈయనతో పాటూ పలువురు ఏరోనాటికల్ సంస్థకు చెందిన సిబ్బంది ప్రయాణించారు. ఆకాశవీధుల్లో విహరించిన విమానం సురక్షితంగా నేలను ముద్దాడింది. ఆ తరువాత తన అనుభవాన్ని వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ. ‘ఈ అనుభవం చాలా కొత్తగా, గొప్పగా ఉంది. స్వదేశీ సాంకేతికత, సామర్థ్యాలపై నా విశ్వాసం మరింత పెరిందని’ కితాబిచ్చారు.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పలు జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. రేపు రేణిగుంట చేరుకొని అక్కడే బస చేసి, ఈనెల 27న శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వనం పలుకుతారు. 27న శ్రీవారి దర్శనం అనంతరం మోదీ తిరిగి తెలంగాణకు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మహబూబాబాద్, కరీంనగర్ సభలకు హాజరై, సాయంత్రం రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..