AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య, కూతురు నిద్రపోతున్న గదిలో పామును విడిచిపెట్టిన భర్త.. ఆ మర్నాడు ఉదయం ఏం జరిగిందంటే..

భార్యతో పదే పదే గొడవ పడుతున్న భర్త గణేష్.. ఓ రోజు కూతురితో కలిసి ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గణేష్ పాములు పట్టే వ్యక్తి వద్దకు వెళ్లి అతడి వద్ద విషపూరితమైన పామును కొన్నాడు. ఓ మతపరమైన కార్యక్రమానికి పాము కావాలని చెప్పిన నిందితుడు విషపూరితమైన పామును కొనుగోలు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అక్టోబర్ 6, 2023న నిందితుడు ఓ ప్లాస్టిక్ డబ్బాలో పామును తీసుకొచ్చి తన ఇంటి గదిలో వదిలేశాడు. అదే గదిలో నిందితుడి భార్య, కుమార్తె నిద్రపోతున్నారు.. పామును విడిచిపెట్టిన తర్వాత అతడు ఆ పక్క గదిలోకి వెళ్లి పడుకున్నాడు.

భార్య, కూతురు నిద్రపోతున్న గదిలో పామును విడిచిపెట్టిన భర్త.. ఆ మర్నాడు ఉదయం ఏం జరిగిందంటే..
Venomous Snake
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2023 | 6:34 PM

Share

ఓ వ్యక్తి ఇంట్లో విషపూరిత పామును వదిలి తన భార్య, బిడ్డను హత్య చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. 25 ఏళ్ల నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఆదిగావ్ అనే గ్రామంలో నెలన్నర క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో పామును ఇంట్లో వదిలిన వ్యక్తి మృతురాలి భర్తే అని తేలింది. అతను తన భార్యతో పాటుగా రెండున్నరేళ్ల కుమార్తె ఉన్న బెడ్ రూమ్ లో  పామును విడిచిపెట్టాడు. పాము కాటుకు గురై తల్లి, కూతురు ఇద్దరు మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లా ఆదిగావ్ గ్రామానికి చెందిన కె. గణేష్ పాత్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. గణేష్ పాత్ర, బసంతిలకు 2020లో వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో గణేష్‌ తరచూ తన భార్య బసంతితో గొడవపడుతుండేవాడని తెలిసింది. భార్యతో పదే పదే గొడవ పడుతున్న భర్త గణేష్.. ఓ రోజు కూతురితో కలిసి ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గణేష్ పాములు పట్టే వ్యక్తి వద్దకు వెళ్లి అతడి వద్ద విషపూరితమైన పామును కొన్నాడు. ఓ మతపరమైన కార్యక్రమానికి పాము కావాలని చెప్పిన నిందితుడు విషపూరితమైన పామును కొనుగోలు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

అక్టోబర్ 6, 2023న నిందితుడు ఓ ప్లాస్టిక్ డబ్బాలో పామును తీసుకొచ్చి తన ఇంటి గదిలో వదిలేశాడు. అదే గదిలో నిందితుడి భార్య, కుమార్తె నిద్రపోతున్నారు.. పామును విడిచిపెట్టిన తర్వాత అతడు ఆ పక్క గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆ మరుసటి రోజు గదిలో నిద్రిస్తున్న తల్లీ, కూతురు పడుకున్న చోటే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసహజ మరణంగా భావించారు. అయితే మృతురాలి తండ్రి తన అల్లుడిపై కేసు పెట్టాడు. ఈసారి పోలీసులు నిందితుడిని విచారించగా అసలు విషయం బయటపడింది.

ఇవి కూడా చదవండి

కేసు నమోదైన నెల రోజుల తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తొలుత విచారణ సందర్భంగా నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశాడు. పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఎక్కడి నుంచో పాము వచ్చి నా భార్యను, బిడ్డను కాటేసి ఉంటుందని వాదించాడు. అయితే పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో నిందితుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..