India-Nepal Relation: రామాయణ్‌ సర్క్యూట్‌పై ఇరుదేశాల మధ్య ఒప్పందం.. ప్రధాని మోదీతో ప్రచండ సమావేశం..

|

Jun 01, 2023 | 10:02 PM

ప్రధానమంత్రి మోడీ, PM ప్రచండ భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉత్తరప్రదేశ్ మొదటి 'ల్యాండ్ పోర్ట్'ని వాస్తవంగా ప్రారంభించారు. ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి.

India-Nepal Relation: రామాయణ్‌ సర్క్యూట్‌పై ఇరుదేశాల మధ్య ఒప్పందం.. ప్రధాని మోదీతో ప్రచండ సమావేశం..
India Nepal Relations
Follow us on

భారత్‌-నేపాల్‌ల మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్‌లో నేపాల్‌ ప్రధాని ప్రచండ నాలుగు రోజుల పర్యటన సందర్భంగా ఒప్పందాలు కుదిరాయి .భారత్‌-నేపాల్‌ మధ్య రామాయణ్‌ సర్క్యూట్‌పై ప్రధాని మోదీ , ప్రచండ సంతకాలు చేశారు. ఇండో-నేపాల్‌ మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం ఇరుదేశాలకు ఉపయోగమన్నారు మోదీ. బత్‌నాహా నుంచి నేపాల్‌ కస్టమ్‌ యార్డుకు కార్గో ట్రేన్‌ను ప్రారంభించారు మోదీ. రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలను మరింత బలోపేత చేయాలని ప్రధాని మోదీ , నేపాల్ పీఎం ప్రచండ నిర్ణయించారు. భారత్‌ -నేపాల్‌ మధ్య సాంస్కృతిక సంబంధాలు కూడా తరతరాల నుంచి ఉన్నట్టు చెప్పారు మోదీ.

గత డిసెంబరులో నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రచండకు ఇదే తొలి విదేశీ ద్వైపాక్షిక పర్యటన.ఇంధనం, కనెక్టివిటీ, వాణిజ్యం సహా అనేక రంగాలలో భారత్‌నేపాల్ సహకారాన్ని పెంపొందించుకునే విషయంలో మోదీ, ప్రచండ విస్తృత చర్చలు జరిపారు.

భారతదేశం – నేపాల్ మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి

భారత్‌కు ఇది నాల్గవ పర్యటన అని చెప్పారు. భారతదేశం- నేపాల్ మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి. ఈరోజు ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనేక ముఖ్యమైన ప్రాజెక్టులను కూడా సంయుక్తంగా ప్రారంభించామని చెప్పారు.

దీనితో పాటు, రైల్వేలోని కుర్తా-బిజల్‌పురా సెక్షన్ ఈ-స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ , నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ సంయుక్తంగా ఆవిష్కరించారు. బత్నాహా నుండి నేపాల్ కస్టమ్ యార్డ్ వరకు భారతీయ రైల్వే కార్గో రైలును ఇద్దరు ప్రధానులు సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం