PM Modi: పరిష్కారాలను కనుగొనడంలో భారత్‌ ఆదర్శ ప్రయోగశాల.. ప్రధాని కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిష్కారాలను కనుగొనే విషయంలో భారత్ ఆరోగ్య ప్రయోగశాల అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ కనుగొన్నటువంటి పరిష్కరాలను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కూడా అమలు చేయవచ్చిని తెలిపారు. జీ-20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మంత్రులతో శనివారం రోజున సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను పంచుకున్నారు. భారత్‌ డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సురక్షితమైన, సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుందని అన్నారు.

PM Modi: పరిష్కారాలను కనుగొనడంలో భారత్‌ ఆదర్శ ప్రయోగశాల.. ప్రధాని కీలక వ్యాఖ్యలు

Updated on: Aug 20, 2023 | 5:12 AM

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిష్కారాలను కనుగొనే విషయంలో భారత్ ఆరోగ్య ప్రయోగశాల అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ కనుగొన్నటువంటి పరిష్కరాలను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కూడా అమలు చేయవచ్చిని తెలిపారు. జీ-20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మంత్రులతో శనివారం రోజున సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను పంచుకున్నారు. భారత్‌ డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సురక్షితమైన, సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుందని మోదీ అన్నారు. ఇండియా ఎంతో వైవిధ్యభరితమైన దేశంగా కొనియాడారు. దేశంలో ఎన్నో రకాల భాషలు, వందల రకాల మాండలికాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకు, సాంస్కృతిక పద్ధతులకు నిలయంగా మారిందని తెలిపారు.

పురాతన సంప్రదాయాల నుంచి ప్రస్తుతం సాంకేతిక వరకు ఇండియా ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు కనుగొనడంలో మన దేశం ఎంతో ఆదర్శవంతమైన ప్రయోగశాల అని తెలిపారు. దేశంలో కనుగొన్నటువంటి ఈ పరిష్కారాలు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కచ్చితంగా అమలు చేయవచ్చని అన్నారు. త్వరలోనే అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పవర్డ్‌ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఫ్లాట్‌ఫాం ‘భాషిణి’ని రూపొందించుకుంటున్నామని అన్నారు. దేశంలో ఉన్నటువంటి అనేక భాషాలను అనువదించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ ఎకానమీ రంగంలో భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రయోగాలను ఆయన సమూలంగా వివరించారు. తమ ఎదురైనటువంటి అనుభవాలను ప్రపంచ దేశాలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. దేశంలో ఉన్నటువంటి వివిధ బ్యాంకుల్లో దాదాపు 50 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ఉన్నాయని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ 50 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో సగానికి పైగా ఖాతాలు మహిళలవే కావడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రస్తుతం 67 శాతం ఖాతాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ ఆర్థక చేరిక ప్రయోజనాలను దేశంలో ఉన్నటువంటి ప్రతి చోటుకు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం భరోస ఇస్తుందని ప్రధాని వెల్లిడింటారు. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా బీజేపీ తమ వ్యూహాలను రచిస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన ఎత్తుగడలను అనుసరిస్తుంది. అలాగే కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో ప్రజల మద్ధతు కోరేందుకు ప్రణాళికలు వేస్తోంది. 2024లో ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..