Operation Sindoor: పాక్‌పై మెరుపు దాడులు.. నిరంతరం పర్యవేక్షించిన ప్రధాని మోదీ

పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్‌ను ప్రధాని మోదీ రాత్రంతా పర్యవేక్షించారు. వార్‌రూమ్ నుంచి ఆయన లైవ్‌లో వీక్షించారు. ప్రతీ అప్‌డేట్‌ను మినిట్ టూ మినిట్ అడిగి తెలుసుకున్నారు.

Operation Sindoor: పాక్‌పై మెరుపు దాడులు.. నిరంతరం పర్యవేక్షించిన ప్రధాని మోదీ
Pm Modi

Updated on: May 07, 2025 | 11:59 AM

పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్‌ను ప్రధాని మోదీ రాత్రంతా పర్యవేక్షించారు. వార్‌రూమ్ నుంచి ఆయన లైవ్‌లో వీక్షించారు. ప్రతీ అప్‌డేట్‌ను మినిట్ టూ మినిట్ అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆయా స్థావరాలను విజయవంతంగా కూల్చేయడంతో ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రస్థావరాలు నేలమట్టం కాగానే ‘జైహింద్’ అంటూ డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

అలాగే ఇవాళ 11 కేంద్ర క్యాబినెట్ కమిటీ భేటి కానుంది. ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS) మీటింగ్ జరగనుంది. ఆపరేషన్ సింధూర్, పాక్ ప్రతిదాడులు, యుద్ద సన్నద్దతపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వనున్నట్టు తెలుస్తోంది.  కాగా, ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత నుంచి 3 సార్లు CCS మీటింగ్ జరిగింది.