PM Modi: సినీ, క్రీడా దిగ్గజాలతో సమావేశమైన ప్రధాని మోడీ.. దక్షిణాది చిత్రాలపై ప్రశంసలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సినీ తారలు, క్రీడాకారులు, స్టార్టప్ ప్రపంచంతో సంబంధం ఉన్న వారితో సమావేశమయ్యారు. కర్ణాటక పర్యటనకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం పలువురు సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సినీ తారలు, క్రీడాకారులు, స్టార్టప్ ప్రపంచంతో సంబంధం ఉన్న వారితో సమావేశమయ్యారు. కర్ణాటక పర్యటనకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం పలువురు సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల చలనచిత్ర పరిశ్రమ భారతదేశ సంస్కృతికి, గుర్తింపునకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చిందని ప్రధాని మోడీ సినీ నటులతో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని పరిశ్రమలు ముఖ్యంగా మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం గురించి ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆదివారం రాత్రి క్రికెటర్ అనిల్ కుంబ్లే, శ్రీనాథ్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ యష్, రిషబ్ శెట్టి తదితరులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లోని పరిశ్రమలు మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని తెలుసుకుని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.





Pm Narendra Modi
ఈ సందర్బంగా ప్రధానమంత్రి దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ను కూడా గుర్తు చేసుకున్నారు. సినిమాలకు సంబంధించిన కోర్సులు.. ఐటీఐలు, సాంకేతికత విధానం గురించి కూడా ప్రధాని మోడీ వారితో మాట్లాడారు.

Pm Modi Yash
జాతీయ విద్యా విధానంతో సహా క్రీడా ప్రతిభను భారత ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తోంది.. అనే దానిని ప్రధాని మోదీ ఈ సందర్భంగా క్రీడాకారులకు వివరించారు.
Rocky Bhai left Impressed after meeting pm modi Sir ..❤️???@TheNameIsYash#sinturana #Yash19 #YashBOSS? #Bengaluru #KGF2 #PMModi #Kannada #Karnataka #KarnatakaElection2023
Love from #Bihar pic.twitter.com/H1iCz2ahKs
— Sintu Rana T.Vijay ß A.A FC (@SintuRana8) February 13, 2023

Pm Modi Rishab Shetty
స్టార్ట్‌అప్ ప్రపంచంతో జరిగిన చర్చలో స్టార్టప్‌లకు మరింత మద్దతు ఇవ్వడం, భారతదేశంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను ఎలా పెంపొందించాలనే దానిపై దృష్టి సారించిందని పేర్కొన్నారు.
When pm Modi sir Talked About kantara with Rishab Shetty @shetty_rishab #sinturana #RishabShetty #kantara #KantaraOnNetflix #RishabShetty #BengaluruMysuruExpressway
Love from #Bihar pic.twitter.com/EjLQHlhvkR
— Sintu Rana T.Vijay ß A.A FC (@SintuRana8) February 13, 2023
ఏరో ఇండియా 2023 14వ ఎడిషన్‌ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు.
వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయిన ప్రధానికి హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్వాగతం పలికారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..