G20 Summit: జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు.. పరస్పర సహకారంపై స్పెషల్ ఫోకస్..

G-20 Summit 2023: జీ20 సమావేశాల నేపథ్యంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అంతకు ముందు బ్రిటన్ ప్రధాని బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో కూడా ప్రధాని ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంల్లో కనెక్టివిటీ, వాణిజ్యం, ఇతర రంగాలలో సహకారాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు.

G20 Summit: జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు.. పరస్పర సహకారంపై స్పెషల్ ఫోకస్..
PM Modi holds meeting with Japan's Fumio Kishida

Updated on: Sep 09, 2023 | 4:25 PM

భారతదేశం తొలిసారిగా G20 సమ్మిట్‌ జరుగుతోంది. రెండు రోజుల సమావేశం ఈరోజు ప్రారంభమైంది. 18వ G20 సదస్సు కోసం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని సువిశాలమైన భారత్ మండపంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ , యూకే ప్రధాని రిషి సునక్‌తో సహా విదేశీ ప్రముఖులు, ప్రతినిధులు, ప్రపంచ నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.

శిఖరాగ్ర సదస్సు మొదటి రోజున ప్రపంచ నాయకులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో.. ఆఫ్రికన్ యూనియన్‌కు గ్రూప్‌లో శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయాలని G20 సభ్యులకు పీఎం మోదీ పిలుపునిచ్చారు. G20 సభ్యుల ఒప్పందంతో, యూనియన్ G20లో శాశ్వత సభ్యత్వం పొందినందున, యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్‌పర్సన్ అజాలీ అసోమాని తన సీటులో కూర్చోవాలని పీఎం మోదీ ఆహ్వానించారు.

ఇదిలావుంటే, న్యూఢిల్లీలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌ సందర్భంగా జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడాతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. G20 సమ్మిట్‌లో మొదటి రోజు ‘వన్ ఎర్త్’ తొలి సెషన్‌కు ఇద్దరు నేతలు హాజరైన తర్వాత ఈ సమావేశం జరిగింది.

ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వివరాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “ పీఎం కిషిదాతో ఉత్పాదక చర్చలు జరిపారు. మేము భారతదేశం-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాం. భారతదేశంలో G20 ప్రెసిడెన్సీ, జపాన్ G7 ప్రెసిడెన్సీ సమయంలో కవర్ చేసాం. కనెక్టివిటీ, వాణిజ్యం, ఇతర రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి తాము ఆసక్తిగా ఉన్నాము.. అంటూ పేర్కొన్నారు ప్రధాని మోదీ.

ఈ సమావేశానికంటే ముందు.. బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారత అధ్యక్షతన దేశ రాజధానిలో జరుగుతున్న G20 సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం తన UK కౌంటర్ రిషి సునక్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. సదస్సు వేదిక ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగింది. మేలో జరిగిన జీ-7 సమావేశానికి జపాన్‌ మోదీని ఆహ్వానించింది.

భారత్ అల్లుడితో ప్రధాని మోదీ..

ఈ ఏడాది మేలో హిరోషిమాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. దీనిలో వారు భారత్-యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఆవిష్కరణలు,సైన్స్‌తో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశాల పై చర్చించారు.  రెండు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. దీని కోసం చర్చలు 2022లో ప్రారంభమయ్యాయి. యూకే-ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం 12వ రౌండ్ చర్చలు ఈ సంవత్సరం ఆగస్టు 8 నుండి 31 వరకు జరిగాయి.

ఈ ప్రాంతంలో చైనా సైనిక శక్తి పెరుగుతున్న నేపథ్యంలో భారత్, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా స్వేచ్ఛాయుతమైన మరియు బహిరంగ ఇండో-పసిఫిక్‌ను నిర్ధారించడానికి ఆచరణాత్మక సహకారంపై దృష్టి పెడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం