బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం రాజస్థాన్‌లోని బికనీర్‌లో రోడ్‌షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు గుమిగూడి ప్రధానికి అభివాదం చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి, బికనీర్ నియోజకవర్గ ఎంపీ అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో కలిసి మోదీ ప్రచారవాహనంలో ప్రయాణించారు. జునాగఢ్ నుంచి రోడ్‌షో ప్రారంభమైంది. దారి పొడవునా ప్రజలకు ప్రధాని చేతులు ఊపుతూ కొందరితో కరచాలనం చేస్తూ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం జరిగే దారి పొడవునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. రాజస్థాన్‌లో నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. బిజెపి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తూ రాష్ట్రంలో రెండు ర్యాలీలలో ప్రధాని ప్రసంగించారు.
ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం..
నరేంద్ర మోదీ రోడ్ షో వీడియో..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..