
అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన, చరిత్రత్మాక ఘట్టం మొదలైంది. మంగళవారం ఆయోధ్య రామమందిరంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, RSS చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. అయోధ్య రామాలయ కంప్లెక్స్‌లో పలు దేవాలయాలను దర్శించారు. ఆ తర్వాత RSS సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్‌తో కలిసి, తొలి అంతస్తులోని రామదర్బార్‌లో పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత ఆయనతో కలిసి గర్భగుడికి వెళ్లి రామ్‌లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు.
అనంరతం అయోధ్యానగరిలో చరిత్రత్మాక ఘట్టమైన రామమందిరంపై జెండాను ప్రధాని మోదీ ఎగరవేశారు.ఆలయపనుల ముగింపునకు గుర్తుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఉదయం 11గంటల 58 నిమిషాలకు ప్రధాని మోదీ రామ మందిరంపై కాషాయ జెండా ఎగురవేశారు. ఆలయ నిర్మాణం పూర్తితో, సాంస్కృతిక వేడుకలు జాతీయ ఐక్యత క కొత్త అధ్యాయానికి నాంది పలికేలా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంతో అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో చివరి ఘట్టం పూర్తైంది.
వీడియో చూడండి..
#WATCH | Ayodhya Dhwajarohan | PM Modi and RSS Sarsanghchalak Mohan Bhagwat ceremonially hoist the saffron flag on the Shikhar of the sacred Shri Ram Janmbhoomi Temple, symbolising the completion of the temple’s construction.
The right-angled triangular flag, measuring 10 feet… pic.twitter.com/Ip8mATz2DC
— ANI (@ANI) November 25, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.