కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలకు వెతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని వెంటనే చట్టాలను రద్దుచేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులు చేస్తున్న ధర్నాకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నాయి ఒక్క బీజేపీ తప్ప. ఇదిలా ఉంటే దేశంలోని రైతుల ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు మరింతప్రయోజనం చేకూరేలా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుందని అమిత్ షా అన్నారు. చెరుకు రైతులకు సాయం అందించేందుకు రూ. 3,500 కోట్లు మంజూరు చేసిందనిఅమిత్ షా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. దీనివల్ల 5 కోట్ల మంది చెరుకు రైతులు, వారి కుటుంబాలు సహా ఈ రంగానికి చెందిన మరో 5 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు అమిత్ షా.