PM Modi: మోడీ సర్కార్ అరుదైన ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న భారత్..

|

Jun 08, 2022 | 1:14 PM

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అమరావతి - అకోలా మధ్య 75 కిలోమీటర్ల (కిమీ) పొడవైన రహదారిని నిర్మించింది. అతి తక్కువ సమయంలో 105 గంటల 33 నిమిషాలలో రహదారిని పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది.

PM Modi: మోడీ సర్కార్ అరుదైన ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న భారత్..
Follow us on

8 Yrs Of Modi Govt: ఏనిదేళ్ల పాలను పూర్తి చేసుకున్న మోడీ సర్కార్ మరో ఘనతను సాధించి అరుదైన ప్రపంచ రికార్డును దక్కించుకుంది. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) ఒకే వరుసలో 75 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Record) లో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసింది. ఈ జాతీయ రహదారి నిర్మాణం ఐదు రోజుల్లోనే పూర్తయింది. దీంతో అంతకుముందు ఖతార్‌ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ రికార్డుకు సంబంధించిన వివరాలను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గిన్నిస్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌తో పాటు రోడ్డు నిర్మాణ ఫొటోలను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అమరావతి – అకోలా మధ్య 75 కిలోమీటర్ల (కిమీ) పొడవైన రహదారిని నిర్మించింది. అతి తక్కువ సమయంలో 105 గంటల 33 నిమిషాలలో రహదారిని పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది. కాగా.. ఈ రహదారి కొత్తగా నిర్మించిన ఎన్‌హెచ్ 53లో భాగం. ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన 800 మంది ఉద్యోగులు, ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌లతో సహా ప్రైవేట్ కంపెనీకి చెందిన 720 మంది కార్మికులు ఈ పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. జూన్ 3వ తేదీ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. జూన్ 7 సాయంత్రం 5 గంటలకు విజయవంతంగా పూర్తి అయినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు నితిన్ గడ్కరీ ప్రత్యేకంగా ట్వి్ట్ చేసి అభినందించారు. ‘‘ఇది మొత్తం జాతికి గర్వకారణం.. 75 కి.మీ పాటు రహదారి పనులను నిరంతరాయంగా కొనసాగించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినందుకు మా టీమ్ NHAI, కన్సల్టెంట్స్, రాజ్‌పత్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ & జగదీష్ కదమ్‌ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. అమరావతి – అకోలా మధ్య NH-53 సెక్షన్‌లో ఒకే లేన్‌లో రోడ్డు నిర్మాణానికి పగలు రాత్రి కష్టపడి పనిచేసిన ఇంజనీర్లు, కార్మికులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’.. అంటూ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.

ఈ ప్రాజెక్టును ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌ ఇన్‌ఫ్రాకాన్‌ అనే సంస్థ చేపట్టింది. అయితే గతంలో కూడా ఈ సంస్థ సాంగ్లీ-సతారా మధ్య 24 గంటల్లో రోడ్డు నిర్మించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అతి తక్కువ సమయంలో 75 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేసిన రికార్డు ఖతార్‌కు చెందిన పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ ఏఎస్‌హెచ్‌డీహెచ్‌ఏఎల్‌ పేరిట ఉంది. 2019, ఫిబ్రవరి 17న అల్‌-ఖర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై 75 కి.మీ. రోడ్డును అష్ఘల్ 10 రోజుల్లో నిర్మించి రికార్డు సృష్టించగా.. తాజాగా దానిని భారత్ బద్దలు కొట్టింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..