పవన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా..!

ఈ ప్రమాద ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. పవన్ కల్యాణ్‌‌కు ఫోన్ చేసిన ప్రదాని మోదీ, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

పవన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా..!
Pawan Kalyam Pm Modi

Updated on: Apr 08, 2025 | 5:20 PM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్‌ స్కూల్‌లో చదువుకుంటున్న పవన్‌ కల్యాన్‌ చిన్నకుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌కి స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మార్క్‌ శంకర్‌ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు గురయ్యాడు. మార్క్ శంకర్‌ను స్కూల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాద ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. పవన్ కల్యాణ్‌‌కు ఫోన్ చేసిన ప్రదాని మోదీ, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

సింగపూర్‌ కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:45 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ‘రివర్ వ్యాలీ రోడ్‌ షాప్‌ హౌస్’ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. అదే భవనంలోని స్కూల్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో15-19 మంది విద్యార్థులు గాయపడగా, ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మార్క్ శంకర్‌కు ప్రాణహాని లేకుండా కాపాడిన సిబ్బందికి ఏపీ మంత్రి నాదెండ్ల మనోహార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రమాదంపై సింగపూర్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు పవన్‌ కుమారుడు త్వరగా కోలుకోవాలని జనసేన కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..