5 Years For Demonetisation: పెద్ద నోట్ల రద్దు చేసిన నాడు దేశానికి చీకటి రోజుగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజు.. నవంబరు 8, 2016న దేశంలో రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు చేసి నేటికి 5 ఏళ్ళు అయిన సందర్భంగా ఖర్గే ఈ అంశంపై స్పందించారు. పెద్ద నోట్ల రద్దుతో మోడీ సర్కారు ఆరోగ్యకరంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ధ్వజమెత్తారు. ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా దేశంలో అనేక చిన్నతరహా పరిశ్రమలు మూత పడ్డాయ్యారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. కరెన్సీ నోట్ల ద్వారా మోడీ సర్కారు ఏమీ సాధించలేకపోయిందని విమర్శించారు.
పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలికితీస్తామని చెప్పుకున్న కేంద్రం.. ఈ విషయంలో ఘోరంగా విఫలం చెందిందని అన్నారు. ఇప్పుడు మునుపటి కంటే వినియోగంలో ఉన్న కరెన్సీ మొత్తం పెరిగిందని.. మరి కేంద్రం సాధించింది ఏంటని ప్రశ్నించారు.
2జీ స్కామ్ ఆరోపణల వెనుక కుట్ర..
2 జీ స్పె్క్ట్రమ్ కేటాయింపుల్లో భారీగా అవినీతి జరిగిందని తప్పడు ప్రచారం చేశారని ఖర్గే విమర్శించారు. నాటి యూపీఏ సర్కారుపై నిరాధార నివేదిక సమర్పించినందుకు మాజీ కాగ్ వినోద్ రాయ్.. తమ పార్టీ నేత సంజయ్ నిరుపమ్‌కు క్షమాపణ చెప్పారని అన్నారు. దీంతో 2జీ స్కామ్ ఆరోపణల వెనుక కుట్ర దాగి ఉందన్న విషయం నిర్ధారణ అయ్యిందన్నారు. 2జీ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రాందేవ్ బాబా వంటి వారు కూడా తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.
పెట్రో ధరల తగ్గింపుతో ప్రయోజనం లేదు..
పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్ పైన 5 నుంచి పది రూపాయలు తగ్గించి ప్రయోజనం లేదని ఖర్గే అన్నారు. మూడు నెలల్లో కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన లక్షా 92 వేల కోట్ల రూపాయలు ఆదాయం పొందిందన్నారు. తగ్గించిన ధరల వల్ల రూ.13 వేల కోట్లు మాత్రమే తగ్గుతాయన్నారు. పెట్రో ధరల విషయంలో చాలా ఆలస్యంగా స్పందించారని… రద్దు చేసిన చెస్ కూడా తక్కువేనన్నారు. అన్నీ అబద్దపు మాటలతో బీజేపీ కాలం వెళ్లదీస్తోందని ఖర్గే విమర్శించారు.
Also Read..
Natraj Master: పాపం పండింది.. ఊసరవెల్లి బయటకు వచ్చింది.. నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్…
Samantha: ‘నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం’.. సమంత ఎమోషనల్ పోస్ట్