
బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇది సిగ్గుచేటు అని అన్నారు. బెంగాల్‌లోని సిలిగురిలో రాష్ట్రపతి సమావేశానికి వేదిక లేకపోవడం, ప్రోటోకాల్ లేకపోవడంపై రాష్ట్రపతి కలతచెందారు. “బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమం గురించి పట్టింపు లేదు, అందుకే ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు.” అని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రకటనపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై మండిపడ్డారు. “ఇది సిగ్గుచేటు, ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్యంలో గిరిజన వర్గాల సాధికారతపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ నిరాశ చెందారు. గిరిజన సమాజం నుండి వచ్చిన రాష్ట్రపతి వ్యక్తం చేసిన బాధ, ఆవేదన భారతదేశ ప్రజలను తీవ్రంగా బాధపెట్టింది” అని ప్రధాని అన్నారు. బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వం నిజంగా అన్ని పరిమితులను దాటిందని ఆయన అన్నారు. రాష్ట్రపతికి జరిగిన ఈ అవమానానికి వారి ప్రభుత్వం బాధ్యత వహించాలి. శాంతల్ సంస్కృతి వంటి ముఖ్యమైన అంశాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.
This is shameful and unprecedented. Everyone who believes in democracy and the empowerment of tribal communities is disheartened.
The pain and anguish expressed by Rashtrapati Ji, who herself hails from a tribal community, has caused immense sadness in the minds of the people… https://t.co/XGzwMCMFrT
— Narendra Modi (@narendramodi) March 7, 2026
ఇదిలావుంటే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం (మార్చి 07) పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని స్వాగతించడానికి ముఖ్యమంత్రి కానీ, మరే ఇతర మంత్రి కూడా హాజరు కాలేదు. బాగ్డోగ్రా విమానాశ్రయానికి సమీపంలోని గోసాయ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరయ్యారు. కానీ రాష్ట్ర యంత్రాంగం అక్కడ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. భద్రత, ఇతర లాజిస్టికల్ కారణాలను చూపుతూ అధికారులు వేదికను బాగ్డోగ్రా విమానాశ్రయం సమీపంలోని గోసాయిపూర్ కు మార్చారు. అంతేకాదు విమానాశ్రయంలో రాష్ట్రపతిని స్వాగతించడానికి హాజరైన ఏకైక ప్రతినిధి సిలిగురి మేయర్ గౌతమ్ దేబ్. ప్రోటోకాల్ ప్రకారం, ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రి సాధారణంగా రాష్ట్రపతిని స్వాగతించడానికి హాజరవుతారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమని, ఈ పదవి పవిత్రతను ఎల్లప్పుడూ గౌరవించాలని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం, ఇప్పటికైనా జ్ఞానానికి వస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం: ధర్మేంద్ర ప్రధాన్
డార్జిలింగ్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యక్తం చేసిన ఆందోళనలు పరిపాలనా వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయి అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి స్వయంగా ఏర్పాట్లపై బాధ వ్యక్తం చేయాల్సి రావడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని పేర్కొన్నారు. రాష్ట్రపతి కార్యాలయంపై నిర్లక్ష్యం లేదా అవమానం దేశ గౌరవానికే భంగం కలిగిస్తుందని ఆయన అన్నారు. రాజ్యాంగ పదవుల గౌరవం ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ఆదివాసీ సమాజాన్ని గౌరవించే కార్యక్రమాలు మరింత బాధ్యతతో నిర్వహించాల్సిన అవసరం ఉందని ట్వీట్‌లో తెలిపారు.
The concerns expressed by Hon’ble President Droupadi Murmu ji @rashtrapatibhvn during her visit to Darjeeling reflect a deeply unfortunate lapse in administrative sensitivity and respect for the highest constitutional office of the country. When the President herself is compelled… https://t.co/GbbIRZjPsd
— Dharmendra Pradhan (@dpradhanbjp) March 7, 2026
ఇది టీఎంసీ ప్రభుత్వంలోని కుళ్ళు బయటపడిందిః అమిత్ షా
బెంగాల్ సర్కార్ తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా విమర్శించారు. రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడం దారుణమన్నారు. “రాష్ట్రపతి ప్రోటోకాల్ పట్ల స్పష్టమైన నిర్లక్ష్యం చూపించారని, దేశ ప్రథమ పౌరురాలిని అవమానించారని” ఆరోపించారు. సోషల్ మీడియా X లో ఒక పోస్ట్‌లో, తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం పాలనను అరాచక ప్రవర్తనగా అభివర్ణించారు. ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును బయటపెట్టిందని, ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించినట్లే అన్నారు. రాష్ట్రపతిని అగౌరవపరిచారని ఆరోపించారు. “ఇది టిఎంసి ప్రభుత్వంలోని కుళ్ళును బయటపెడుతుంది. ఇది పౌరుల రాజ్యాంగ హక్కులను ఇష్టానుసారంగా ఉల్లంఘించడమే కాకుండా, భారత రాష్ట్రపతిని నిరంకుశత్వంతో వ్యవహారించారు” అని కేంద్ర హోం మంత్రి అన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవికి చూపిన అగౌరవం.. దేశానికి, భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలకు అవమానం అని అమిత్ షా అన్నారు. నేడు, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి పౌరుడు తీవ్ర బాధతో ఉన్నారు” అని ఆయన అన్నారు.
The TMC Government in West Bengal today hit a new low in its anarchic behaviour by humiliating the President of India with its glaring disregard for protocol.
This lays bare the rot in the TMC Government which not only violates the constitutional rights of citizens at will but…
— Amit Shah (@AmitShah) March 7, 2026
అయితే , బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి వివాదాలు కొత్త కాదు.. కేంద్రంతో మొదలైన వివాదం ఈసీకి చేరుకుంది. తరువాత గవర్నర్‌తో కూడా ఆమె చాలా సార్లు గొడవ పడ్డారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి ప్రోటోకాల్ వివాదంలో దీదీ ఇరుక్కోవడం సంచలనం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…