WITT 2025: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు

టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా పాల్గొని, భారత్‌ను సూపర్ పవర్‌గా నిలబెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ రెండు రోజుల సదస్సులో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. డిజిటల్ ఇండియా దార్శనికత దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందని మోదీ అన్నారు. వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

WITT 2025: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు
My Home Group Chairman Jupally Rameswar Rao

Updated on: Mar 28, 2025 | 5:16 PM

భారతదేశం నేడు ఏం ఆలోచిస్తుందో, ప్రపంచం రేపు ఆ ఆలోచన చేస్తుందనేది ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో జరుగుతున్న వాదన. అందుకే ఈ విషయాన్ని నొక్కి చెప్పేందుకు భారతదేశంలోనే అతి పెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ 9 ముందుకొచ్చింది. ఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. భారత్‌ నేడు ఏం ఆలోచిస్తోందనే అనే విషయం స్వయంగా ప్రధాని వెల్లడించారు. ఇండియాను సూపర్‌ పవర్‌గా నిలబెట్టేందుకు ఉన్న ఆవకాశాలను వివరించారు.

TV9 WITT గ్రాండ్ వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీకి మై హోమ్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు స్వాగతం పలికారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన అన్నారు. మోదీ ‘డిజిటల్ ఇండియా’ దార్శనికత దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందన్నారు.

ఢిల్లీ భారతమండపం వేదికగా రెండు రోజులు జరిగే వాట్‌ ఇండియా థింక్స్ టుడే సమిట్‌లో అనేక మంది కేంద్ర మంత్రులు, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. విపక్షం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బిహార్‌ విపక్ష నేత తేజస్వీ యాదవ్‌ హాజరుకానున్నారు. ఆలోచనల మహాకుంభమేళాగా అభివర్ణించే ఈ సదస్సును టీవీ నైన్ నెట్‌వర్క్‌ నిర్వహించడం ఇది వరుసగా మూడోసారి. గతేడాది నిర్వహించిన సదస్సులోనూ ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. టీవీనైన్‌ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అభినందించారు.

సినిమా, క్రీడలు, పరిశ్రమ నుంచి కూడా అనేక మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్ తార యామి గౌతమ్‌, పారిశ్రామికవేత్త వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్ అగర్వాల్‌ సహ అనేక మంది లబ్దప్రతిష్ఠులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఐదు దేశాలతో పాటు భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లోని 16 ప్రదేశాల నుంచి విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్‌గా వాట్‌ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో పాలుపంచుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..