విషవాయువుతో నిండిన బావిలో పడిన వ్యాన్‌.. 12 మంది మృత్యువాత.. ప్రధాని సంతాపం..

భారీ క్రేన్ సాయంతో వ్యానును బయటకు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా మాట్లాడుతూ..డ్రైవర్‌ వ్యాన్‌పై నియంత్రణ కోల్పోయాడని, రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయిందని, బావిలో విషవాయువు ఉందని చెప్పారు. వ్యాన్‌లో ఇద్దరు పిల్లలతో సహా 13 మంది ఉన్నట్లు చెప్పారు. జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

విషవాయువుతో నిండిన బావిలో పడిన వ్యాన్‌.. 12 మంది మృత్యువాత.. ప్రధాని సంతాపం..
Pm Modi

Updated on: Apr 28, 2025 | 7:17 AM

ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న వ్యాన్ బైక్ ను ఢీకొట్టింది.. దాంతో బైక్‌ సహా, వ్యాన్‌ అమాంతంగా పక్కనే ఉన్న ఓ పాడుబడిన బావిలో పడిపోయింది..ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్ లోని మాందసార్ జిల్లాలో ఏప్రిల్‌ 27 ఆదివారం చోటు చేసుకుంది. జిల్లాలోని నారాయణ్ ఖేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచారియా గ్రామంలో వేగం అదుపు తప్పిన వ్యాన్‌ బైక్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. పూర్తి వివరాలలోకి వెళితే..

పోలీసుల కథనం ప్రకారం వేగంగా వెళ్తున్న వ్యాన్ ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఆ సమయంలో వ్యాన్ లో ఇద్దరు చిన్నారులతో పాటు 13 మంది ఉన్నట్లు సమాచారం. ఓ బైకర్, వ్యానులోని 9 మందితో పాటు సాయం చేయడానికి వచ్చిన ఓ గ్రామస్థుడు మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యాన్ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు సాక్షులు చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. భారీ క్రేన్ సాయంతో వ్యానును బయటకు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా మాట్లాడుతూ..డ్రైవర్‌ వ్యాన్‌పై నియంత్రణ కోల్పోయాడని, రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయిందని, బావిలో విషవాయువు ఉందని చెప్పారు. వ్యాన్‌లో ఇద్దరు పిల్లలతో సహా 13 మంది ఉన్నట్లు చెప్పారు.

జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) Xలో పోస్ట్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..