PM Modi: మహిళలకు ప్రధాని మోదీ అదిరిపోయే గిఫ్ట్.. గ్యాస్ సిలిండర్లపై భారీ తగ్గింపు..

|

Mar 08, 2024 | 9:09 AM

మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ అదిరిపోయే గిఫ్ట్‌ను ప్రకటించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల జీవితాన్ని మరింత సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే.?

PM Modi: మహిళలకు ప్రధాని మోదీ అదిరిపోయే గిఫ్ట్.. గ్యాస్ సిలిండర్లపై భారీ తగ్గింపు..
Pm Modi
Follow us on

మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ అదిరిపోయే గిఫ్ట్‌ను ప్రకటించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల జీవితాన్ని మరింత సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే.? ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై రూ. 100 మేరకు తగ్గింపు ప్రకటించారు. ఈ నిర్ణయం సామాన్య మహిళల జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా కోట్లాది కుటుంబాల ఆర్ధిక భారాన్ని కూడా తగ్గిస్తుందని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ చర్య పర్యావరణ పరిరక్షణను కాపాడటమే కాకుండా.. ప్రతీ కుటుంబం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.

ప్రధాని మోదీ ట్వీట్..

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీం అర్హులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. రూ. 300 సబ్సిడీ మొత్తాన్ని మరో ఏడాది పాటు అందించనున్నట్టు వెల్లడించింది. 2025 మార్చి 31 వరకు ఈ సబ్సిడీ వర్తించనుందని పేర్కొంది. కాగా, ఉజ్వల స్కీం అర్హులకు ఇంతకముందు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూ. 200 ఉండగా.. ఆ మొత్తాన్ని గత ఏడాది అక్టోబర్ నుంచి రూ. 300గా పెంచుతున్నట్టు మోదీ సర్కార్ ప్రకటించిన సంగతి విదితమే.

మహిళలకు ప్రధాని మోదీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు..