జైట్లీ కుటుంబసభ్యులకు మోదీ, అమిత్ షా పరామర్శ

దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఫ్రాన్స్‌లో (జీ -7 సదస్సు ముగించుకుని ఢిల్లీ వచ్చిన మోదీ) ఇవాళ ఉదయం జైట్లీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే హోం మంత్రి అమిత్ షా అక్కడ ఉన్నారు. అనంతరం జైట్లీ చిత్రపటానికి పూలమాలలు వేసి.. అమిత్ షా, మోదీ నివాళులు అర్పించారు. జైట్లీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, జైట్లీ మృతి చెందిన సమయంలో మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన […]

జైట్లీ కుటుంబసభ్యులకు మోదీ, అమిత్ షా పరామర్శ

Edited By:

Updated on: Aug 27, 2019 | 12:49 PM

దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఫ్రాన్స్‌లో (జీ -7 సదస్సు ముగించుకుని ఢిల్లీ వచ్చిన మోదీ) ఇవాళ ఉదయం జైట్లీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే హోం మంత్రి అమిత్ షా అక్కడ ఉన్నారు. అనంతరం జైట్లీ చిత్రపటానికి పూలమాలలు వేసి.. అమిత్ షా, మోదీ నివాళులు అర్పించారు. జైట్లీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, జైట్లీ మృతి చెందిన సమయంలో మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన భారత్‌కు రావడానికి సిద్ధమైనప్పటికీ.. జైట్లీ కుటుంబసభ్యుల సూచనతో మోదీ విదేశీ పర్యటన కొనసాగించారు.