మన్ కీ బాత్‌లో ఉగ్రవాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సర్జికల్ స్ట్రైక్, జనగణనపై ప్రస్తావన..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్'లో ఉగ్రవాదంపై కీలక సందేశం ఇచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు పదేళ్లు పూర్తైన సందర్భంగా భారత సైన్యం ధైర్యాన్ని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై భారత్ 'జీరో టాలరెన్స్' విధానం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. జనగణన పురోగతి, అశోక్ సింఘాల్ సేవలను కూడా ప్రస్తావించారు. దేశ భద్రత, పౌరుల బాధ్యతలను ప్రధాని మోదీ గుర్తు చేశారు.

మన్ కీ బాత్‌లో ఉగ్రవాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సర్జికల్ స్ట్రైక్, జనగణనపై ప్రస్తావన..!
Pm Modi Man Ki Baat

Updated on: Sep 27, 2026 | 12:15 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఉగ్రవాదంపై కీలక సందేశం ఇచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు పదేళ్లు పూర్తైన సందర్భంగా భారత సైన్యం ధైర్యాన్ని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై భారత్ ‘జీరో టాలరెన్స్’ విధానం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. జనగణన పురోగతి, అశోక్ సింఘాల్ సేవలను కూడా ప్రస్తావించారు. దేశ భద్రత, పౌరుల బాధ్యతలను ప్రధాని మోదీ గుర్తు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (సెప్టెంబర్ 27) ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 138వ ఎపిసోడ్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించిన ఆయన.. దేశ భద్రత, ఉగ్రవాదంపై భారత విధానం, జనగణన, సంస్కృతి తదితర అంశాలపై మాట్లాడారు.

సర్జికల్ స్ట్రైక్‌కు పదేళ్లు

2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్‌కు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ దాన్ని ప్రస్తావించారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆయన గుర్తుచేశారు. ఉగ్రవాదానికి భారత్ ఇకపై తగిన సమాధానం ఇస్తుందనే సందేశాన్ని సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి అందించినట్లు పేర్కొన్నారు. బాలాకోట్ వైమానిక దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు.. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ తన వైఖరిని స్పష్టంగా చాటిందని మోదీ అన్నారు. ప్రస్తుతం దేశం ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోందని పేర్కొన్నారు.

*జనగణనపైనా ప్రస్తావన

దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన ప్రక్రియను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి దశ ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలిపారు. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జనగణన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి జాతీయ బాధ్యత అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

అశోక్ సింఘాల్ సేవలను గుర్తుచేసిన మోదీ

విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు దివంగత అశోక్ సింఘాల్‌ను ప్రధాని మోదీ స్మరించారు. సంస్కృతి, సమాజం, దేశం కోసం ఆయన చేసిన సేవలను ప్రస్తావించారు. రామ జన్మభూమి ఉద్యమంలో సింఘాల్‌ పాత్రను ప్రధాని మోదీ గుర్తుచేశారు.

హైదరాబాద్‌లో పాల్గొన మంత్రి కిషన్ రెడ్డి

ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ పరిధిలోని గౌతమ్ నగర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us