PM Jan Dhan Yojana: ఆసరాగా నిలుస్తున్న జన్‌ ధన్‌ పథకం.. ఇప్పటి వరకు ఎంత మంది ఖాతాలు తీసుకున్నారో తెలుసా..?

|

Oct 29, 2021 | 8:28 PM

PM Jan Dhan Yojana: ప్రధానమంత్రి జన్‌ ధన్ యోజన (PMJDY) .. దేశ ప్రజలందరికీ సుపరిచితమైన పేరు ఇది. ఈ పథకం ద్వారా..

PM Jan Dhan Yojana: ఆసరాగా నిలుస్తున్న జన్‌ ధన్‌ పథకం.. ఇప్పటి వరకు ఎంత మంది ఖాతాలు తీసుకున్నారో తెలుసా..?
Pm Jan Dhan Yojana
Follow us on

PM Jan Dhan Yojana: ప్రధానమంత్రి జన్‌ ధన్ యోజన (PMJDY) .. దేశ ప్రజలందరికీ సుపరిచితమైన పేరు ఇది. ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనాలు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ తొలి విడత సంకీర్ణ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని కీలకమైన పథకాల్లో ఇదీ ఒకటి. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించిన స్కీమ్. ఒకరకంగా నరేంద్ర మోడీ మానస పుత్రికగా దీనిని చెప్పుకోవచ్చు.

ఈ జన్‌ ధన్‌ యోజన (PMJDY) కింద బ్యాంకు ఖాతాలు అక్టోబర్‌ 2021 వరకు ఏడు సంవత్సరాలలో 44 కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన ఆగస్టు 15, 2014న ప్రధాన నరేంద్రమోదీ ప్రకటించారు. అందరికి జీరో అకౌంట్‌ బ్యాంకు ఖాతా ఉండి సౌలభ్యం పొందడానికి ఆగస్టు 28, 2014లో ఈ పథకాన్ని ప్రారంభించారు మోదీ. ఈ జాతీయ మిషన్‌ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బ్యాంకింగ్‌, క్రెడిట్‌, ఇన్సూరెన్స్‌, పెన్షన్‌ వంటి ఆర్థిక సేవలను పొందేలా చేయడం కోసం దీనిని ప్రారంభించారు.

నేషనల్‌ ఇ-సమ్మిట్‌ ఆన్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజర్‌-రోడ్‌ మ్యాప్‌ ఫర్‌ యాన్‌ ఇన్‌క్లూజివ్‌ భారత్‌ అనే అంశంపై జరిగిన  కార్యక్రమంలో ఆర్థిక సలహాదారు మనీషా సెన్‌శర్మ మాట్లాడారు. ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన ప్రారంభించిననాటి నుంచి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఈ ఖాతాల ద్వారా ఎంతో మందికి ప్రయోజనం చేకూరిందన్నారు. జన్‌ ధన్‌లో భాగంగా అక్టోబర్‌ 2021 నాటికి 44 కోట్ల మంది లబ్దిదారులు చేరారని అన్నారు. అట్టడుగు వర్గాల వారికి ఈ జీరో అకౌంట్‌ సదుపాయం ఎంతగానో మేలు జరిగిందని, దీని ద్వారా ఎన్నో లాభాలు పొందారన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వ పథకాలు సామాన్యులకు చేరుతున్నాయా లేదా అనే సందేహాలు కలిగేవని, ప్రస్తుతం సాంకేతికతను ఉపయోగించడం ద్వారా అర్హులైన వారు ప్రభుత్వ ప్రయోజనాలు పొందగలుగుతున్నారని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు లేకుండా కేంద్ర ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.

బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలోకి కోట్లమంది..

కోట్లాదిమంది దేశ ప్రజలను బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలోకి తీసుకొచ్చిన ఒకే ఒక్క వ్యవస్థ ఇది. అప్పటిదాకా బ్యాంకుల గురించి పెద్దగా తెలియని, పరిచయం లేని పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కోట్లాదిమంది ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లను ఓపెన్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

Indian Railways: గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి వచ్చిన ఎకానమీ AC-3 టైర్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..

EPF: ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 6 కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే బెనిఫిట్‌..!