Plastic Straw Ban: ఆ రోజు నుంచి ప్లాస్టిక్ స్ట్రాలు బంద్.. దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ఆంక్షలు..

|

Jun 10, 2022 | 7:38 AM

దేశంలో జులై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ స్ట్రాలను బ్యాన్‌ అమల్లోకి రానుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఏడాది పాటు వాయిదా వేయాలని కోరుతున్నాయి పలు కంపెనీలు..

Plastic Straw Ban: ఆ రోజు నుంచి ప్లాస్టిక్ స్ట్రాలు బంద్.. దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న ఆంక్షలు..
Plastic straw ban in India
Follow us on

Plastic straw ban in India: ఫ్రూట్‌ జ్యూస్‌, మిల్క్‌ షేక్‌, లస్సీ ఏది తాగాలన్నా ప్లాస్టిక్‌ స్ట్రా ఉపయోగించడం సర్వ సాధారణం.. ఇక టెట్రా ప్యాక్‌లతో వచ్చే పానీయాలకు స్ట్రాల వినియోగం తప్పనిసరి.. అయితే జులై 1వ తేదీ నుంచి ప్లాస్టిక్‌ స్ట్రాలు ఇక కనిపించవంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్ట్రాలు మాత్రమే కాకుండా సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలను నిషేధిస్తున్ననట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిర్ణయమే జులై 1 వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి రానుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పానీయాల ఉత్పత్తుల కంపెనీల నెత్తి మీద పిడుగు పడ్డట్టుగా మారింది. నిషేధం అమల్లోకి వస్తే ప్రత్యామ్నాయం ఏమిటి అనేది ప్రధాన సమస్యగా మారింది. కోకాకోలా, పెప్పీ, అమూల్‌, పార్లే తదితర శీతల పానీయాలు, పాల ఉత్పత్తుల కంపెనీలు పెద్ద ఎత్తున టెట్రా ప్యాక్‌లో తమ ఉత్పత్తులను చాలా కాలంగా మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. వీటితో పాటే స్ట్రాలను కూడా అందిస్తారు.. ఇప్పుడు స్ట్రా బ్యాన్‌ చేసే వీటి వినియోగం కష్టమేనని పలు కంపెనీలు పేర్కొంటున్నాయి.

పర్యావరణ సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించే దిశగా ప్లాస్టిక్‌ స్ట్రాలను కూడా నిషేధించింది. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా పేపర్‌ స్ట్రాలు రావాలంటే మరి కొంత కాలం పట్టు అవకాశం ఉంది.. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కనీపం ఏడాది పాటైనా ప్లాస్టిక్‌ స్ట్రాల వినియోగంపై నిషేధాన్ని వాయిదా వేయాలని ఈ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుతున్నాయి. దేశీయంగా పేపర్ స్ట్రాల ఉత్తత్తి చాలా తక్కువగా ఉన్న విషయాన్ని ఈ కంపెనీలు గుర్తు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..